* రాష్ట్ర రాజకీయాల్లో చిన్నమ్మ పాత్ర కీలకం కానుందా ?

  * బహుబాషా కోవిదురాలుగా చిన్నమ్మ గుర్తింపు

  * చిరునవ్వే చిన్నమ్మ ఆభరణం
 
(అమరావతి - ఇండియా హెరాల్డ్ ): విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు- బసవతారకం దంపతులకు రెండో సంతానంగా 1959,ఏప్రిల్-2 న జన్మించారు పురందేశ్వరి.ఆమె బాల్యమంతా చెన్నైలోనే గడిచింది.ఆమెకు దాదాపు అయిదు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉందికనుకనే ఆమెను బాహుబషా కోవిదురాలుగా గుర్తింపు పొందారు.తండ్రి కోరిక మేరకు కూచిపూడి నృత్యం నేర్చుకున్న చిన్నమ్మ అద్భుతమైన ప్రతిభను కనబరిచారు.ఆమె ప్రకాశం జిల్లా కారంచేడు వాసి ఐనా దగ్గుబాటి వెంకటేశ్వర్లు గారితో వివాహం యింది. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నప్పుడు వెంకటేశ్వర్లు గారు క్రియశిలక రాజకీయాల్లో ఉండేవారు. ఎన్టీఆర్ మరణానంతరం పురందేశ్వరి ఆమె భర్త కాంగ్రెస్ పార్టీలో చేరారు.2004 లో బాపట్ల నుండి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి తక్కువ మెజారిటీతో గెలుపొందారు.2006 లో మన్మోహన్సింగ్ హయాంలో MHRD సహాయమంత్రిగా పనిచేసారు.2009లో కాంగ్రెస్ పార్టీ తరపున విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేసి గెలుపొంది మరలా MHRD సహాయ మంత్రిగా చేశారు. 2012లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల సహాయ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు.ఎంపీగా ఉన్నప్పుడు గృహహింస బిల్లు, హిందూ వారసత్వ సవరణ బిల్లు ప్రత్యేక న్యాయస్థానాలా ఏర్పాటు బిల్లులపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు.

2004-05 లో ఆసియన్ ఏజ్ ఉత్తమ పార్లమెంట్ అవార్డుకి ఎంపిక చేశారు.తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఖండిస్తూ కాంగ్రెస్ నుంచి బీజేపీకి పార్టీ మారారు.అదే ఏడాది రాజంపేట నుండి బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైనారు.2019 ఎన్నికల్లో కూడా వైజాగ్ నుండి పోటీ చేసి ఓడిపోయారు.2020 లో ఒరిస్సా బీజేపీ ఇంచార్జ్ నియమించారు.తర్వాత 2023-జులై-4న ఆంధ్రప్రేదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా నియమించారు. ఏపీలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్న పురందేశ్వరి టిడిపి,బిజెపి,జనసేన కూటమిగా ఏర్పడటంలో పురంధేశ్వరి క్రియశిలకమైన పాత్ర పోషించారు.ఇటీవల టిడిపి వ్యవస్థాపకుడు అయినటువంటి నందమూరి తారకరామారావు గారి శతజయంతి వేడుకల సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్టీఆర్ యొక్క వంద రూపాయల వెండి నాణాన్ని విడుదల చేయించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే చిన్నమ్మ భర్త కొడుకు రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. చిన్నమ్మ మాత్రం దీనికి భిన్నంగా రాజకీయంలో తనదైన శైలిలో  దూసుకుపోతున్నారు.తండ్రి ఎన్టీఆర్ నుంచి అలవడిన క్రమశిక్షణ స్వచ్ఛ రాజకీయాల వైపు తనని నడిపించాయి. ఎదుటివారిని గౌరవించడం మరియు రాజకీయ ప్రత్యర్థులు తనను లక్ష్యంగా చేసుకొని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన చక్కనైన చిరునవ్వుతో సమాధానాలు ఇవ్వడం చిన్నమ్మ ప్రత్యేకత.చిన్నమ్మ ఆమె వయసుకు తగ్గట్టుగానే చీరకట్టులో అలాగే తన తండ్రి చూపిన అడుగుజాడల్లో నడవడం, పుట్టింటికి అలాగే అత్తింటికి ఎక్కడ కూడా విమర్శలకు తావు లేకుండా ఆమె రాజకీయా ప్రయాణం కొనసాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: