ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీను విడుదల చేస్తామని చెప్పి మరి వాటి మీద సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు.. రాష్ట్ర ఐటీ, విద్య  శాఖ మంత్రి నారా లోకేష్ ఆయా శాఖలలో ఉండేటువంటి ఖాళీలను సైతం భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే విద్యా శాఖలో అనేక మార్పులను చేయడం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలలో చదువుకొనే విద్యార్థులకు విద్యా దీవెన వసతి దీవెన స్థానంలో పాత ఫీజులు మెంబర్స్ని అమలు చేయడం జరిగింది.



అలాగే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఉద్దేశంతో నారా లోకేష్ పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వైసిపి పార్టీ ప్రభుత్వం విద్యా దీవెన, వసతి దీవెన పథకం కింద 3,480 కోట్ల రూపాయలు  అలాగే ఉంచడం వల్ల విద్యార్థుల సర్టిఫికెట్లు ఆయా విద్యాసంస్థలలోనే ఉండిపోయాయంటూ లోకేష్ తెలియజేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలో డ్రగ్స్ ను సైతం అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు కూడా చేపడుతున్నారు లోకేష్. ఇలాంటి సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా 3220 లెక్చరర్ పోస్టులను భర్తీ చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు.



రాజకీయ ప్రమేయం లేకుండానే పూర్తిగా పారదర్శకంగా ప్రతిభా ఆధారంగానే ఈ పోస్టులను సైతం భర్తీ చేసేలా చూస్తామని నారా లోకేష్ తెలియజేశారు.. అలాగే యూనివర్సిటీలకు సంబంధించి అకాడమిక్ ఎగ్జామ్ షెడ్యూల్ను క్యాలెండర్ను తయారుచేసి ఆయా సమయాలను పరీక్షలు నిర్వహించి ఫలితాలను కూడా విడుదల చేసేలా చేస్తామంటూ లోకేష్ తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కళాశాలలో గత ఐదేళ్లుగా ప్రవేశాలు చాలా తగ్గిపోయాయని ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సాధించి అడ్మిషన్లు పెంచేందుకు అవసరమైన చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. ఏది ఏమైనా నిరుద్యోగులకు అదనంగా 3220 లక్షల పోస్టులను భర్తీ చేయడం జరుగుతోంది. దీంతో నిరుద్యోగులు కూడా ఈ ఉద్యోగాల కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: