చాలామంది ప్రజలు ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళుతూ అక్కడ ఏజెంట్ చేతులలో మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎడారులలో మేకలు, కోళ్లు, గుర్రాలు, పశువులు మేపుతూ చాలామంది వీడియోలు చేస్తూ ఉంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన శివ అనే వ్యక్తి ఎట్టకేలకు లోకేష్ వళ్ళ విముక్తి లభించింది. ఎడారిలో తనని వదిలిపెట్టారని ఎవరు పలకరించే వారు ఇక్కడ కరువు.. యజమానులు కూడా ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు.. తినడానికి  తిండి కూడా లేదు ఇలాగైతే ఒకటి రెండు రోజులలో తాను మరణించేటట్టు ఉన్నాను అంటూ శివ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోను సైతం పోస్ట్ షేర్ చేశారు.


దీంతో తనను ఆదుకోవాలని ఏపీ మంత్రి నారా లోకేష్ ని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే లోకేష్ ఈ వీడియో పైన కూడా స్పందిస్తూ తనని తీసుకొచ్చి బాధ్యతను తీసుకున్నారు. ఈ బాధితుడు అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం చింతపర్తిలో ఈయన కుటుంబం ఉన్నదట. అతని భార్య కుమార్తెలు చేసిన విజ్ఞప్తిపైన మంత్రి నారా లోకేష్ వెంటనే రియాక్ట్ అయ్యి.. కేంద్ర విద్యా శాఖ మంత్రి జయశంకర్ తో మాట్లాడడం జరిగింది. కువైట్లో ఎడారిలో దుర్భర జీవితాన్ని  గడుపుతున్న శివాను సైతం వెంటనే తీసుకురావాలని టిడిపి ఎన్నారై విభాగానికి లోకేష్ అప్రమాత్రం చేయించారు.


దీంతో లోకేష్ విజ్ఞప్తి మేరకు ఎడారి జీవితాన్ని గడుపుతున్న శివాకు సైతం విముక్తి కలిగించారు. అతడిని అక్కడి నుంచి సురక్షితంగా భారత్ రాయబార కార్యాలయానికి తీసుకువచ్చారు.అక్కడి నుంచి ఇండియాకి తిరిగి వెళ్లే వరకు అన్ని సదుపాయాలు కల్పించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా శివా తన సంతోషాన్ని తెలియజేస్తూ అధికారులు తనను రక్షించారని తమను తీసుకువచ్చేలా చేసిన నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే కుటుంబ సభ్యులకు కూడా ఎప్పటికీ లోకేష్ కు రుణపడి ఉంటామని తెలియజేశారు.. అయితే శివ మధ్యలో దళారులను నమ్మి మోసపోయానని తెలియజేశారు. ఇక లోకేష్ చేసిన పనికి టిడిపి నేతలు కార్యకర్తలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: