తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ -అలీ కాంబో గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అలీ లేకుండా పవన్ కల్యాణ్ సినిమా ఉండేది కాదు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే రాజకీయాల నేపథ్యంలో ఇరువురు మధ్య అభిప్రాయభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో అలీకి పవన్ కల్యాణ్‌కు మధ్య గ్యాప్ వచ్చింది. అలీ వైసీపీలో చేరిన తర్వాత పవన్ కల్యాణ్ నటించిన సినిమాలలో దాదాపు అలీకి అవకాశం రాలేదు. దీంతో అప్పటి నుంచి అలీకి, పవన్ కల్యాణ్‌కు చెడింది అంటూ వార్తలు వినిపించాయి. అంతేకాదు పవన్ కల్యాణ్‌పై సినీనటుడు అలీ పోటీ చేస్తారని కూడా టాక్ వినిపించింది. అయితే అలీ మాత్రం అసలు ఎన్నికల్లోనే పోటీ చేయకుండా సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఏపీలో వైసీపీ దారుణమైన ఓటమి చవి చూడడంతో మెల్లగా ఒక్కొక్కరు జారుకుంటున్నారు. చంద్రబాబు సీఎంగా, పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి తమ మార్క్ పాలనతో దూసుకుపోతుండడంతో వైసీపీకి నిద్రపట్టడం లేదు. అయితే వైసీపీ ఓటమితో తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయిన అలీ.. ఇక రాజకీయాలు వద్దు అంటూ వైసీపీకి రాజీనామా చేశారు.అయితే పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక.. ఏకంగా రాజకీయాలు వదిలేశారు అలీ. సినిమాలు, షూటింగ్‌లే లోకం అంటున్నారు. ఇదంతా పవన్ ఫ్యాన్స్ ఎఫెక్టే అనే చర్చ జరుగుతోంది.అలీ వైసీపీ ముద్ర నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసి చివరకు తనకు అప్పగించిన మీడియా రిలేటెడ్ పోస్ట్ కు రిజైన్ చేశారు.

ప్రస్తుతం అలీసినిమా ప్రమోషన్లో భాగంగా మీడియా ప్రతినిధులు పవన్ గూర్చి ఒక ప్రశ్న అడగ్గా దానికి అలీ చాలా తెలివిగా సమాధానం చెప్పాడని తెలుస్తుంది.అయితే ఆ ప్రశ్న పవన్ కళ్యాణ్ గూర్చి అవడంతో దానికి సమాధానంగా 'రాజకీయాలు ఇప్పుడు వద్దు.. వదిలేశాగా' అని ముక్తసరిగా సమాధానం చెప్పడం కనిపించింది. అంతే కాదు ఇంటర్వ్యూ ప్రారంభించేటప్పుడే 'ఇది కేవలం సినిమా ప్రమోషన్స్ కోసం మాత్రమే. వ్యక్తిగత ప్రశ్నలు వద్దు' అని గట్టిగా చెప్పేస్తున్నాడు. దాంతో పవన్ ప్రశ్నల పరంపర నుంచి తప్పించుకొంటున్నాడు.పవన్ పై స్పందించడానికి అలీకి ఇప్పుడున్న ఇబ్బంది ఏమిటో అర్థం కాదు. తను వైకాపాలో లేడు. ఓ సినిమా నటుడిగా పవన్ విజయాన్ని ఒప్పుకొంటే గౌరవంగా, హుందాగా ఉండేది. ఈ టాపిక్ ఇక్కడితో ఆగిపోయేది. అలీ తప్పించుకొనేకొద్దీ ఈ ప్రశ్నల వరద కొనసాగుతూనే ఉంటుంది. అలీకీ, పవన్‌కీ మధ్య మంచి స్నేహం ఉండేది. ఓ స్నేహితుడిగా పవన్ విజయాన్ని ఒప్పుకొంటే హుందాగా ఉండేది. అలీ రాజకీయాలకు దూరమైనంత మాత్రాన ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనుకొంటే ఎలా..? పైగా అలీ చాలా తెలివైన వాడు. లౌక్యం తెలిసినవాడు. తను ఇలా తప్పించుకొని తిరగడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: