- జనం మెచ్చిన జనం నుంచి వచ్చిన నాయకురాలు సీతక్క..
- ప్రజలతోనే ప్రయాణం పూరి గుడిసెలోనే భోజనం..
- ముక్కు సూటిగా మాట్లాడే తత్వం సొంత పార్టీ తప్పు చేసిన ప్రశ్నించే గుణం..


 గన్ను పట్టి  అడవిలో తిరిగిన చేతులే ఇప్పుడు పెన్ను పట్టి ప్రజా సమస్యలు తీరుస్తున్నాయి. పేదోడికి కష్టం ఎక్కడుంటే అక్కడ వాలిపోయే అక్క.. పేదవాడి బాధలు  తీర్చేందుకు ప్రజా క్షేత్రంలోకి వచ్చింది. పేద కుటుంబంలో పుట్టి పెద్ద చదువులు చదివి, ప్రజా సమస్యలు తీర్చేందుకు  ఎర్ర జెండా పట్టింది. కారడవిలో కటిక చీకట్లో  ఎన్నో రాత్రులు గడిపింది. చేనుల్లో చెలకల్లో సేద తీరింది. పేదల కడుపులు నింపింది. ఆశతో ఎవరైనా అక్కా అని పిలిస్తే అక్కున చేర్చుకుంది. ఇంతకీ ఆ అక్క ఎవరయ్యా అంటే  ది గ్రేట్  కాంగ్రెస్ మంత్రి సీతక్క. దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి  వారి వ్యవస్థను పారదోలేందుకు గన్ను పట్టింది. చివరికి ఆ వ్యవస్థ తగ్గిన తర్వాత ప్రజాసేవ చేసేందుకు  రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అసెంబ్లీలోకి వచ్చింది. ప్రజలే ప్రథమ దైవంగా భావించిన అక్క ప్రజలతోనే ఉంటూ, వారి యోగక్షేమాలు చూసుకుంటూ వారితోనే తింటూ అన్ని తానే చూసుకుంటూ వచ్చింది.  ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచినా తన ఆహర్యంలో కానీ తన రూపంలో కానీ క్యారెక్టర్ లో కానీ ఏమాత్రం చేంజింగ్ రాలేదు. చాలా సింపుల్ గా  తలలో నాలుకగా పేద ప్రజల అక్కగా మారింది సీతక్క. ప్రస్తుత కాలంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయితే వారి రేంజ్ మారిపోయే పరిస్థితి ఉంది. కార్లు,బంగ్లాలు,  లక్షల విలువ చేసే బట్టలు,బంగారు ఆభరణాలు ఇలా ఎన్నో ధరిస్తూ ఉన్నారు. కానీ సీతక్క మాత్రం  చాలా సింపుల్ గా  పేదింటి బిడ్డలా  ప్రజల్లో మమేకమై ప్రజలతోనే గడుపుతూ వస్తోంది.  అలా ఉంది కాబట్టే  ములుగు నియోజకవర్గంలో  వరుసగా గెలుస్తూ వస్తోంది. అలాంటి సీతక్క రాజకీయ ప్రస్థానం ఎలాంటిదో చూద్దాం..
 

రాజకీయ జీవితం:
 చిన్నతనం నుంచే  ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి సీతక్క దళితులపై జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఎదిరించాలనే లక్ష్యంతో 1988లో పీపుల్స్ వార్ పార్టీలో చేరింది. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ వాలిపోయి సమస్యను క్లియర్ చేస్తూ వచ్చింది. 1989లో ఒకరోజు పోలీసులు  విపరీతమైన దాడి చేసి కాల్పులు జరిపారు. సీతక్క తో పాటు మరికొంతమంది దళం సభ్యులు పట్టుబట్టారు. దీంతో సీతక్క కొన్ని నెలల పాటు జైల్లో ఉండి, ఆ తర్వాత మళ్లీ దళంలోకి వెళ్ళింది. 1996లో మళ్లీ సీతక్క దళం నుంచి పూర్తిగా బయటకు వచ్చి పోలీసులకు లొంగిపోయింది. ఇదే సమయంలో ప్రజా సమస్యలపై కొట్లాడుతున్న సీతక్కకు  గిరిజన ప్రాంతాలలో మహిళలకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం అందించింది టిడిపి. దీంతో ఆమెను పోటీ చేయమని కొంతమంది సన్నిహితులు ప్రోత్సహించడంతో  1999లో టిడిపి నుంచి మొదటిసారి ప్రయత్నం చేసింది. కానీ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఇక 2004లో  ములుగు అభ్యర్థిగా సీతక్కను ప్రకటించాడు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి  వీరయ్య పై ఓటమిపాలైంది. ఆమెకు ప్రజల్లో మంచి పేరున్న ప్రచారం చేయడానికి తక్కువ టైం దొరకడంతో ఓడిపోయింది. మళ్లీ 2009లో టిడిపి నుంచి టికెట్ వచ్చింది. ఆ టైంలోనే పోదాం వీరయ్య పై 18 వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది. మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టింది. కానీ ఆ సమయంలో టిడిపి ఓటమి చవి చూడడంతో నిధుల విషయంలో చాలా ఇబ్బందులు పడింది.


 మళ్లీ 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం. ఆ తర్వాత మళ్లీ పోటీ చేసి అజ్మీర చందూలాల్ పై ఓడిపోయి ఓటమి ని చవిచూసింది. ఆ తర్వాత 2018 లో కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్లీ చందులాల్ పై పోటీ చేసి  22 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. రెండవసారి అసెంబ్లీలో అడుగు పెట్టి తన గళాన్ని వినిపించింది. కెసిఆర్ చేసిన పాలనను ఎండగడుతూ వచ్చింది. తన నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తనదైన మార్కు సంపాదించుకుంది. 2020 మార్చ్ లో వచ్చిన లాక్ డౌన్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో సీతక్క పేరు పాపులర్ అయిపోయింది. ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అనే విషయాన్ని చాటి చెప్పింది. ప్రజల కోసం నడుచుకుంటూ వాగులు వంకలు దాటుతూ వారికి ఆహారం అందిస్తూ అడవుల పొంటి తిరిగింది. దీంతో సీతక్క సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో విపరీతమైనటువంటి ఫాలోయింగ్ పెంచుకుంది. అలా 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి మరోసారి ఘన విజయం సాధించింది. ఆమె టాలెంట్ను   గుర్తించినటువంటి కాంగ్రెస్ అధిష్టానం ఈసారి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించడంతో సీతక్క రాష్ట్రమంతా తిరుగుతూ తన సేవలందిస్తోంది. ఇంత ఎదిగినా సీతక్కా ఇప్పటికి సింప్లిసిటీ మెయింటైన్ చేస్తూ, రోడ్డు పక్కన ఉండే చిన్న చిన్న హోటల్లలో తింటూ, ప్రజా సేవకు ఎక్కువ టైం కేటాయిస్తూ ఉంటుంది. హంగు ఆర్భాటాలు లేని మంత్రిగా  పేరు తెచ్చుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: