రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నారా బ్రాహ్మణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు కోడలిగా, బాలయ్య కూతురిగా, నారా లోకేశ్ భార్యగా బ్రాహ్మణికి పేరున్నా తాను అడుగుపెట్టిన వ్యాపార రంగాలలో సక్సెస్ సాధించి బ్రాహ్మణి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు. ప్రస్తుతం బ్రాహ్మణి పాలిటిక్స్ కు దూరంగా ఉన్న సరైన సమయం వస్తే ఆమె రాజకీయాల్లోకి రావడం పక్కా అని అభిమానులు ఫీలవుతున్నారు.
 
విదేశాలలో ఉన్నత చదువులు చదివినా తెలుగింటి ఆడపడుచులా కనిపించడానికి బ్రాహ్మణి ఇష్టపడతారు. సమయం, సందర్భానికి అనుగుణంగా డ్రెస్సింగ్ స్టైల్ ను ఫాలో అయ్యే బ్రాహ్మణి చాలా సందర్భాలలో తన వాగ్ధాటితో మెప్పించారు. ఇంగ్లీష్ లో మాట్లాడినా తెలుగులో మాట్లాడినా అనర్ఘళంగా మాట్లాడి మెప్పించడం బ్రాహ్మణి ప్రత్యేకత చెప్పవచ్చు. పంజాబీ డ్రెస్, చీరకట్టులో కనిపించడానికి బ్రాహ్మణి ఎంతగానో ఇష్టపడతారు.
 
తన ప్రవర్తనతో అటు పుట్టింటికి ఇటు మెట్టినింటికి మంచి పేరు తెచ్చిపెడుతున్న బ్రాహ్మణి కెరీర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒకవైపు ఇల్లాలిగా మరోవైపు వ్యాపారవేత్తగా సత్తా చాటుతూ తన ప్రతిభతో బ్రాహ్మణి ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుండటం గమనార్హం. సోషల్ మీడియాలో సైతం బ్రాహ్మణి యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.
 
నా ప్రతి విజయం వెనుక లోకేశ్ ఉన్నాడని పలు సందర్బాల్లో బ్రాహ్మణి వెల్లడించడం గమనార్హం. ఈ ఎన్నికల్లో మంగళగిరిలో భారీ మెజారిటీతో లోకేశ్ ఎమ్మెల్యేగా గెలవడం వెనుక బ్రాహ్మణి పాత్ర ఎంతో ఉంది. బ్రాహ్మణి మంగళగిరిలో ఎన్నికల ప్రచారం చేసి ప్రశంసలు అందుకున్నారు. నారా బ్రాహ్మణి భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. నారా బ్రాహ్మణి సినీ రంగానికి మాత్రం పూర్తిస్థాయిలో దూరంగా ఉండటం గమనార్హం. సినిమా రంగంలో నిర్మాతగా ఎంట్రీ ఇవ్వడానికి కూడా బ్రాహ్మణి ఆసక్తి చూపకపోవడం గమనార్హం. బ్రాహ్మణి తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: