•తమిళనాట అమ్మగా నిలిచిన జయలలిత

•కట్టు బొట్టుతో అమ్మ అనే పదానికి నిర్వచనం చూపించింది

•ప్రత్యర్థులను గడగడలాడించడంలో దిట్ట..

(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)

జయలలిత.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈమె గురించి తెరకెక్కిన చిత్రాలు కూడా ఈమె అంటే ఎవరో మనకు అర్థమయ్యేలా చేస్తాయి. ఈమె పేరు మాత్రమే కాదు ఒక జనసంద్రం అని చెప్పాలి. నాడు మహాభారతంలో ద్రౌపతి కి ఎంతటి అవమానమైతే జరిగిందో.. అసెంబ్లీలో కూడా అన్ని అవమానాలను ఎదుర్కొంది జయలలిత .. కానీ వాటిని అధిగమించి ప్రజల మన్ననలు పొంది భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యి అందరినీ ఆశ్చర్యపరచడమే కాదు అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా అడుగుపెట్టి తనను తల్లిగా కాదు ఒక ఆడదానిలా చూసిన వారందరికీ ముచ్చెమటలు పట్టించింది.

తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించి.. ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచింది.. అంతేకాదు అప్పట్లో మహిళలు ఏదైనా ఒక సమస్య గురించి చెప్పుకోవాలన్నా కూడా భయపడేవారు. కానీ జయలలిత ముందుకు వచ్చిన తర్వాత ఆడవారు తమను తాము నిరూపించుకోగలుగుతున్నారు. ముఖ్యంగా తమిళనాడులో ఆడవారికి అంత ప్రాముఖ్యత ఇచ్చిన దాఖలాలు లేవు.. కానీ ఎప్పుడైతే జయలలిత అధికారంలోకి వచ్చిందో అప్పటినుంచి వారికి గౌరవ మర్యాదలు పూర్తిస్థాయిలో పెరిగిపోయాయని చెప్పాలి.. చూడడానికి కట్టుబొట్టు సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ గా ఉండే.. జయలలిత గొంతు విప్పిందంటే మాత్రం ఎదుటివాడు దడ దడ లాడాల్సిందే.

నిజాయితీతో పరిపాలన చేస్తూ.. తమిళనాడు ప్రజలకు అమ్మగా చిరస్థాయిగా నిలిచిపోయింది.. ఆమె నేడు మన మధ్య లేకపోయినా తమిళనాడు ప్రజలు అమ్మగా, ఆరాధ్య దైవంగా ఆమెను భావిస్తూ ఉంటారు. ఇక జయలలిత కట్టుబొట్టు విషయానికి వస్తే.. చిన్న బార్డర్ కరిగిన ప్లెయిన్ శారీలను ఆమె ఎక్కువగా ధరిస్తూ ఉండేది . అదే ఆమె వస్త్రధారణకు ప్రతీక అని చెప్పవచ్చు. ఇక చిన్న బొట్టు ధరించి చాలా సింప్లిసిటీ గా ఉంటుంది.. ముఖ్యమంత్రి.. అంతకుముందు ఎన్నో చిత్రాలలో నటించి భారీగా సంపాదించి ఉంటుంది... అలా వేలకోట్ల ఆస్తులు కూడబెట్టి ఉంటారు.. కానీ వేటిని కూడా ఆమె తన సొంతం కోసం ఉపయోగించుకోలేదు. కనీసం తన జీతం కూడా ఆమె తన కోసం ఉపయోగించుకోలేదని చెబుతూ ఉంటారు.. ఇక అందుకే నేటికి తమిళనాడు ప్రజల్లో ఎనలేని అభిమానం అని చెప్పడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: