* కేసీఆర్ తో  ఎక్కువ రోజులు ప్రయాణం
* తెలంగాణ రాములమ్మగా గుర్తింపు
* హీరోయిన్ గా,  లేడీస్ సూపర్ స్టార్ గా విజయశాంతి సక్సెస్
* తల్లి తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయ పోరాటం


టాలీవుడ్ నటీనటులు చాలామంది రాజకీయాలలో సక్సెస్ అయ్యారు. అలాంటి వారిలో విజయశాంతి ఒకరు. తెలంగాణ ముద్దుబిడ్డగా పేరు తెచ్చుకున్న రాములమ్మ... మొదట టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగారు. చిరంజీవి,  బాలయ్య తదితర సీనియర్ హీరోల సరసన అప్పట్లో హీరోయిన్గా నటించి... తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు విజయశాంతి. అప్పట్లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసి సక్సెస్ అయ్యారు.


అయితే అలాంటి విజయశాంతి.. మొదటినుంచి రాజకీయాల పైన ఎక్కువగా దృష్టి పెట్టారు. భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన విజయశాంతి.. ఇప్పటివరకు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఆమె సినిమాలలో కూడా ఒసేయ్ రాములమ్మ, సమ్మక్క సారక్క లాంటి పోరాట పట్టిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. విజయశాంతి నిజ జీవితంలో కూడా... తెలంగాణ కోసం చాలా పోరాడాలి.


అంతేకాదు తల్లి తెలంగాణ పేరుతో.. ఓ పార్టీని స్థాపించి.. ఢిల్లీ మెడల్ వంచే ప్రయత్నం చేశారు. కానీ అందులో విఫలమైన విజయశాంతి మళ్లీ కెసిఆర్ వంచన చేరారు. గులాబీ పార్టీలో.. పలుసార్లు మెదక్ ఎంపీగా కూడా గెలిచారు విజయశాంతి.  తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత బిజెపి... ప్రస్తుతం మళ్ళీ కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. ఇలా రాజకీయాలలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ..విజయశాంతి ముందుకు సాగుతున్నారు.

అయితే హీరోయిన్ స్థాయి నుంచి ఇప్పటివరకు ఆమె ఎక్కడ కూడా... ఎక్స్పోజింగ్ కు తావు ఇవ్వలేదు. సినిమాల్లో ఎక్కువగా చీరలే కట్టి హీరోయిన్గా రాణించారు. పోలీస్ గెటప్ లు కూడా చేశారు. ఇక రాజకీయాలలో ఎప్పుడు చీరలోనే కనిపించారు రాములమ్మ. ఆమె ఎప్పుడూ.. మీడియా ముందుకు వచ్చిన... దొర అంటూ కేసిఆర్ ను.. తిడుతూ ఉంటారు. కెసిఆర్ నే కాకుండా ఎవరినైనా సరే... ఎక్కువగా దొర అంటూ సంబోధిస్తారు. అదే సమయంలో తెలంగాణ జోలికి వస్తే... చంద్రబాబు లాంటి నాయకులను... సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: