తెలుగు రాష్ట్రాలలో రాజకీయాల్లో రాణిస్తున్న మహిళా మణులు  ఎంతోమంది ఉన్నారు. ఎవరికివారు తమదైన శైలిలోనే పాలన సాగిస్తూ తమ వాక్చాతుర్యంతో అటు ప్రజలందరినీ కూడా ఆకట్టుకోగలుగుతున్నారు అని చెప్పాలి. అంతేకాదు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించడంలో కూడా ఇక ఇలాంటి మహిళ రాజకీయ నాయకురాళ్లు ఎంతోమంది ఎంతో దూకుడు కనబరుస్తూ ఉంటారు. ఇలా రాజకీయాల్లో రాణిస్తూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో విజయశాంతి కూడా ఒకరు. సాధారణంగా ఎంతో మంది హీరోయిన్లు సినిమాల్లో ఒకలాగా రాజకీయాల్లో మరోలా ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 కానీ విజయశాంతి మాత్రం సినిమాల్లో హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో ప్రజా సమస్యల గురించి సినిమాలు చేస్తూ.. ఒసేయ్ రాములమ్మ అని పిలిపించుకుంది. ఇక ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి తను అందరిలాంటి హీరోయిన్ అని అనిపించుకుంది. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అదే సీరియస్ నెస్ తో ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ.. ఇక ప్రజల దృష్టిని తన వైపుకు తిప్పుకోగలిగింది. ఇక పాలన విషయంలో కూడా తనదైన ముద్ర వేసుకుంది. అయితే చీర కట్టులో ఎంతో సౌమ్యంగా కనిపించే విజయశాంతి.. ఒక్కసారి నోరు విప్పిందంటే ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే.


 సబ్జెక్టు పై ఎంతో పట్టు ఉన్న విజయశాంతి.. ఇక ఏ విషయం పైన అయినా సరే అనర్గళంగా మాట్లాడగలదు. అందుకే తెలుగు రాజకీయాలలో ఆమెకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఇంత టాలెంట్ ఉన్నప్పటికీ ఎందుకో ఆమెకు రాజకీయలు మాత్రం ఎక్కడా కలిసి రాలేదు. తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని పార్టీలు మారుతూనే వస్తూ ఉన్నారు విజయశాంతి. బిఆర్ఎస్ బిజెపి ఇప్పుడు కాంగ్రెస్.. ఇక మధ్యలో సొంతంగా ఒక పార్టీ కూడా పెట్టారు. ఇక ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆమె ఎక్కడా తెరమీద కనిపించడం లేదు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఎక్కడ ప్రచారాలలో కూడా పాల్గొనలేదు. దీంతో గతంలో ఎంపీగా పదవి బాధ్యతలు చేపట్టి తన వాక్చాతుర్యంతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న విజయశాంతి.. ఇక ఇప్పుడు మాత్రం కనుమరుగైన రాజకీయ నాయకురాలిగా మిగిలిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: