- మాటలు తక్కువ పనులు ఎక్కువ.
- ఐదుసార్లు ఎమ్మెల్యేగా రికార్డు.
- చేవెళ్ల చెల్లెమ్మగా గుర్తింపు.


సబితా ఇంద్రారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలనుంచే మహిళ లీడర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అప్పటి రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లోనే హోం మంత్రిగా రికార్డు సృష్టించింది. అలాంటి సబితా ఇంద్రారెడ్డిని రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల చెల్లెమ్మ అని పిలిచేవారు. చేవెళ్ల నుంచి తన మొదటి పాదయాత్ర మొదలుపెట్టి రాష్ట్రమంతా చుట్టి సక్సెస్ అయ్యారు. అందుకే సబితా ఇంద్రారెడ్డిని చేవెళ్ల చెల్లెమ్మ అంటూ ముద్దుగా పిలుస్తూ ఉంటారు. ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రెండుసార్లు మంత్రి పదవి పొందిన కానీ, ఏమాత్రం అహంకార భావం చూపించకుండా సాదాసీదా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే ఎన్నో హంగు ఆర్భాటాలు, లక్షల విలువచేసే బట్టలు, బంగారు ఆభరణాలు ధరించి, ఎవరు సాటి లేరు అనిపించుకునే మహిళా నాయకురాళ్లు ఎంతోమంది ఉన్నారు. కానీ సబితా ఇంద్రారెడ్డి మాత్రం వాటన్నిటికీ దూరంగా ఉండి ప్రజా సేవే లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఆమె మాటలు తక్కువ మాట్లాడి, అభివృద్ధి పనులను ఎక్కువగా చేసే అద్భుతమైన పనిమంతురాలు. అందుకే గత ఐదు పర్యాయాల నుంచి ప్రజల మన్ననలు పొందుతూ, రాజకీయ చతురత చూపిస్తోంది. చేవెళ్ల నియోజకవర్గంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచింది ఆ తర్వాత మహేశ్వరం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచింది. అలా సదాసీదాగా రాజకీయాల్లో దూసుకుపోయే సబితా ఇంద్రారెడ్డి రాజకీయ జీవితం గురించి కొన్ని విషయాలు చూద్దాం.

 హోం మంత్రిగా రికార్డ్:
 రోడ్డు ప్రమాదంలో పటోళ్ల ఇంద్రారెడ్డి మరణించడంతో  అభిమానుల ఒత్తిడి వల్ల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది సబితా ఇంద్రారెడ్డి. దివంగత నేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  చేవెళ్ల నుంచి తన పాదయాత్రకు స్వీకారం చుట్టి  ముఖ్యమంత్రిగా విజయాన్ని అందుకున్నారు. ఇక అప్పటినుంచి ఆమె  ఆమెను చేవెళ్ల చెల్లెమ్మ అని పిలుస్తూ వచ్చారు. ఇక ఆయన కేబినెట్ లోనే ఈమె తొలి మహిళ హోం మంత్రిగా రికార్డు సాధించింది. అలాంటి సబితా ఇంద్రారెడ్డి భర్త మరణించడంతో 2000 సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసి  చేవెళ్లలో భారీ విజయాన్ని అందుకున్నారు. మళ్లీ 2004  సాధారణ ఎన్నికల్లో కూడా టిడిపి అభ్యర్థిపై 41 వేల ఓట్ల మెజారిటీతో మళ్ళీ గెలుపొందారు. ఈ టైంలోనే ఆమెను వైయస్సార్ మెన్స్ మరియు జియాలజీ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన  జరిగింది. ఈ సమయంలోనే చేవెళ్ల ఎస్సీ రిజర్వుడ్ గా మారిపోయింది.


ఆ తర్వాత మహేశ్వరం నియోజకవర్గానికి చేంజ్ అయిన  సబితా ఇంద్రారెడ్డి  మొదటి ప్రయత్నంలోనే 8000 ఓట్ల తేడాతో తీగల కృష్ణారెడ్డిని ఓడించింది. ఈమె టాలెంట్ ను గుర్తించిన రాజశేఖర్ రెడ్డి మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  హోం మంత్రిగా అవకాశం కల్పించారు. దేశంలోనే మహిళ హోం మంత్రిగా ఈమె రికార్డు సృష్టించింది అని చెప్పవచ్చు. ఇక 2014 లో  మరోసారి ఎన్నికలు నిర్వహించగా  కాంగ్రెస్ నుంచి తన కొడుకు పోటీ చేసి ఓడిపోయాడు. మళ్లీ 2018 తెలంగాణ  రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ టికెట్ తీసుకొని పోటీ చేశారు. ఈ సమయంలో ఆమె అద్భుతమైన మెజారిటీతో గెలుపొందారు.  అలా టిఆర్ఎస్ అధికారంలోకి రావడంతో  కాంగ్రెస్ పార్టీని వదిలి కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరి మంత్రి అయింది. విద్యాశాఖ మంత్రిగా  సేవలందించింది.  అలాంటి సబితా ఇంద్రారెడ్డి మళ్ళీ 2023 సాధారణ ఎన్నికల్లో కూడా మహేశ్వరం నుంచి పోటీ చేసి అద్భుత మెజారిటీతో గెలుపొందింది. ప్రస్తుతం ఆమె టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ వస్తోంది. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: