మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహ‌న్‌ రెడ్డి.. తన చెల్లి వైఎస్ షర్మిలపై ఎంత ఆగ్రహంతో రగిలిపోతున్నారో.. తన తల్లి వైయస్ విజయలక్ష్మి విషయంలోనూ అంతే ఆగ్రహంతో ఉన్నారా..? చెల్లిని మాత్రమే కాదు.. అమ్మ విజయలక్ష్మిని కూడా దూరం చేసుకోవాలని డిసైడ్ అయ్యారా..? వైసీపీ ఓటమికి తన చెల్లి షర్మిల ఎంత కారణమో.. తల్లి విజయలక్ష్మి కూడా అంతే కారణమని పార్టీ నేతల అభిప్రాయంతో జగన్ ఏకీభవించారా..? భవిష్యత్తులో కూడా తన తల్లి విజయలక్ష్మి.. చెల్లితోనే ఉంటుందని జగన్ నిర్ణయం తీసుకున్నారా..? అందుకే జగన్ కూడా తల్లితో దూరం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారా..? అంటే అవుననే సమాధానాలు వైసీపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.


వైసీపీ ఓటమికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. అందులో వైఎస్ కుటుంబ వివాదాలు కూడా.. తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా జగన్ గంపెడు ఆశలు పెట్టుకున్న రాయలసీమలో ఫ్యాన్ పార్టీ కకల‌వికలం కావటానికి షర్మిల కూడా ఒక కారణం. పైగా షర్మిల స్వయంగా కడప పార్లమెంటుకు పోటీ చేసి కడప పార్లమెంటు సిటీలో కూడా వైసీపీకి చావు దెబ్బ చూపించారు. వైసీపీ గట్టి పోటీ మధ్యలో విజయం సాధించింది. పోలింగ్‌కు ముందు కడప ఎంపీగా తన కుమార్తె షర్మిలను గెలిపించాలని విజయలక్ష్మి పిలుపు ఇవ్వడం.. రాయలసీమ మొత్తం మీద తీవ్ర ప్రభావం చూపిందని వైసీపీ అంచనాకు వచ్చింది. ఇదే పులివెందులలో జగన్ మెజార్టీ భారీగా పడిపోవడానికి కూడా కారణమైంది.


ఇదే అభిప్రాయాన్ని ఇప్పుడు వైసీపీ నేతలు ఒక్కొక్కరికి వ్యక్తం చేస్తున్నారు. ఇక కేతిరెడ్డి, పేర్ని నాని లాంటి వాళ్ళు కూడా వైసీపీ ఓటమికి ష‌ర్మిలతో పాటు.. వైఎస్ విజయలక్ష్మి కూడా కారణం అని చెబుతున్నారు. వైసీపీ నాయకులు అందరిలోనూ దాదాపు ఇదే అభిప్రాయం ఉంది. ఇవన్నీ ఇప్పుడు వారు జగన్ ముందు ఉంచడంతో జగన్ సైతం ఇదే అభిప్రాయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తల్లి విజయలక్ష్మి కూడా వైసీపీ ఓటమికి కారణం అని.. తన ముఖ్యమంత్రి పీఠం పోవటానికి ఆమె కూడా తన వంతు పాత్ర పోషించారని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జగన్ అటు చెల్లితో.. ఇటు తల్లితోనూ పూర్తిగా తన ఫ్యామిలీతో దూరం కావాలని భావిస్తున్నారని.. అందుకే ఆయన సన్నిహిత నేతలు కూడా జగన్ తల్లి పై విమర్శలు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: