అంబటి రాంబాబు వైసీపీ అధినేత జగన్ కోసం గత 15 ఏళ్లుగా ఎలా ? నోరు వేసుకుని అరి చేసేవారో చూస్తూనే ఉన్నాం. జగన్ మీద కాకి కాదు కదా.. ఈగ వాలిన ఎవరు ఏమన్నా.. చీమ చిట్ట‌కుమ‌న్నా వెంటనే అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టేసి.. ప్రెస్ ముందుకు వచ్చేసి విరుచుకుపడిపోయేవారు. ఒకానొక సందర్భంలో నీకు పని తక్కువ.. నోరు ఎక్కువ.. అని జగన్ సైతం అంబటి విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. 2014 ఎన్నికలలో సత్తెనపల్లిలో ఓడిపోయిన అంబటి రాంబాబుకు.. 2019లో జగన్ టిక్కెట్టు ఇవ్వకూడదని కూడా నిర్ణయించుకున్నారు. అంబటి కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమలాడితే చివర నిమిషంలో సీటు వచ్చింది.


తొలిముడేళ్లు అంబటికి మంత్రి పదవి రాలేదు. అనంతరం ప్రక్షాళనలో జిల్లా నుంచి కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ భావించడంతో కీలకమైన జలవనరుల శాఖ మంత్రి పదవి కూడా దక్కింది. పోలవరం అదిగో పూర్తి చేస్తాం.. ఇదిగో పూర్తి చేస్తాం అంటూ ప్రగల్బాలు పలికారే తప్ప అంబటి మంత్రిగా చేసింది శూన్యం. పైగా విపరీతమైన అవినీతి ఆరోపణలు ఆయనపై వచ్చేసాయి. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో జగన్.. అంబటిని ఫ్యామిలీని బాగా ముంచి వదిలి పెట్టేశారు. అసలు ఎన్నికలలో అంబ‌టికి సీటు వస్తుందో.. లేదో.. అన్న డౌట్ ఉంది. అంబటికి సీటు వద్దని సత్తెనపల్లి స్థానిక వైసీపీ నేతలు అందరూ జగన్‌కు చెప్పారు.


అయితే జగన్ పిలిచి వారిని జో కొట్టి అంబటిని మరోసారి గెలిపించాలని ఆయనకే సీటు ఇచ్చారు. మరో జాక్పాట్ ఏంటంటే.. అంబటి సోదరుడు అంబటి మురళికి ఏకంగా పొన్నూరు అసెంబ్లీ సీటు ఇచ్చారు. ఇటు అంబటి రాంబాబు తో పాటు.. అటు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ కాస్త వెనకేసుకున్న అంబటి మురళి సైతం ఎన్నికలలో భారీగా ఖర్చు పెట్టారు. ఘోరంగా ఓడిపోయారు. ఇలా అంబటి ఫ్యామిలీకి రెండు సీట్లు ఇచ్చి ఇద్దరితో భారీగా ఖర్చు పెట్టించిన జగన్.. ఇద్దరినీ ముంచేసినట్లయింది. ఈ దెబ్బకు అంబటి ఫ్యామిలీ ఆర్థికంగా కోలుకోవడం చాలా కష్టం అన్న చర్చలు అయితే గుంటూరు జిల్లాలో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: