పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ ఒక్క ఓటమి దెబ్బతో కకావికలం అవుతుంది. తెలంగాణలో 10 ఏళ్లపాటు అధికారంలో ఉండి వరుసగా రెండు ఎన్నికలలో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ.. గత డిసెంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికలలో ఓడిపోయింది. అక్కడి నుంచి రోజు రోజుకు ఆ పార్టీ గ్రాఫ్ శరవేగంగా పతనమౌతూ వస్తోంది. పార్లమెంటు ఎన్నికలలో ఒక్క ఎంపీ సీట్లు కూడా గెలుచుకోలేదు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఏ రోజు..? ఏ ఎమ్మెల్యే..? పార్టీ మారతారు ఏ నాయకుడు..? పార్టీని వీడతారో కూడా అర్థం కాని పరిస్థితి. పార్టీ మారతారని అనుమానాలు ఉన్నా.. ఎమ్మెల్యేలను తండ్రి, కొడుకులు.. కేసీఆర్, కేటీఆర్ పిలిచి స్వయంగా బుజ్జగిస్తున్నా.. ఎవరూ మాట వినటం లేదు.


ఇక తాజాగా ఈనెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. ఈ లోగా మరికొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీకి షాక్ ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్.. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే లందరూ కలిసి స్పీకర్‌ను కలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే హరీష్ రావు.. కేటీఆర్ ఆధ్వర్యంలో స్పీకర్‌ను కలవబోతున్నందున.. అందరు ఎమ్మెల్యేలు ఈ మీటింగ్ కి రావాలని సమాచారం ఇచ్చారు. కానీ ఈ పిలుపుకు 14 మంది ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టారు.


కేసీఆర్‌ను మినహాయిస్తే.. 13 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు..? అన్న చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. బీఆర్ఎస్ కు మొత్తం 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో పది మంది ఇప్పటికే కాంగ్రెస్ గుటికి చేరిపోయారు. మిగిలిన 28 మందిలో కేవలం 14 మంది స్పీకర్‌ను కలిసే మీటింగ్‌కు వచ్చారు. తాజాగా డుమ్మా కొట్టిన వారిలో మాజీమంత్రి మల్లారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఇప్పుడు వీరులో కూడా మరికొందరు పార్టీ మారిపోవడం ఖాయమని బిఆర్ఎస్ లోనే చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా ఒకే ఒక్క ఓటమి దెబ్బతో కేసీఆర్, కేటీఆర్ ను ఎవరు నమ్మటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: