కొందరు నేతలకు రాజకీయంగా తిరుగులేని లక్ చిక్కుతుంది. అలాంటి వారిలో రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా ఉంటారు. ఆదిరెడ్డి ఫ్యామిలీ రాజమండ్రి నియోజకవర్గంలో.. రాజకీయంగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బలమైన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాజమండ్రి గెలుచుకుంది. ఆదిరెడ్డి వాసు తల్లి ఆదిరెడ్డి వీరరాఘవమ్మ.. రాజమండ్రి మేయర్‌గా పనిచేశారు. అనంతరం ఈ ఫ్యామిలీ వైసీపీలోకి వెళ్ళింది. వాసు తండ్రి ఆదిరెడ్డి అప్పారావు వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. ఇలా రాజమండ్రిలో ఆ ఫ్యామిలీకి బలమైన నేపథ్యం ఉంది.


2019 ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గాలిలో తెలుగుదేశం చిత్తుచిత్తుగా ఓడిపోయినా కూడా.. రాజమండ్రి సిటీ నియోజకవర్గ నుంచి వాసు భార్య ఆదిరెడ్డి భవాని ఏకంగా 32 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక ఈ ఎన్నికలలో వాసు రాజమండ్రి సిట్టింగ్ ఎంపీగా ఉండి వైసీపీ నుంచి పోటీ చేసిన మార్గాని భరత్ రామ్ పై ఏకంగా 71 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇలా ఈ ఫ్యామిలీలో వాసుతో పాటు ఆయన భార్య, అటు తండ్రి, తల్లి అందరూ కీలక పదవులు అధిరోహించారు. ఇక ప్రస్తుతం వాసు ఎమ్మెల్యేగా ఉన్నారు. వాసుకి బావమరిది.. కింజరపు రామ్మోహన్ నాయుడు ఏకంగా కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు.


అటు వాసు చినమామ అచ్చెం నాయుడు మంత్రిగా ఉన్నారు. ఇలా తన బావమరిది, చిన్నమామ ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. కావలసినన్ని నిధులు రాబట్టుకొని రాజమండ్రి సిటీ నియోజకవర్గాన్ని ఒక రేంజ్‌లో డెవలప్ చేసుకోవచ్చు. ఇక కాస్త దూరపు చుట్టరికం అయినా రామ్మోహన్ నాయుడు మామగారు.. బండారు సత్యనారాయణ కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలోని మాడుగుల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా వీరి కుటుంబం అందరూ కీలక పదవుల్లో ఉన్నారు. ఎప్పటినుంచో అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న వాసు కోరిక కూడా ఈసారి నెరవేరింది. రాజకీయంగా బలమైన పునాదులతో పాతుకుపోవటానికి వాసుకు ఇదే మంచి అవకాశం. ఏది ఏమైనా ఆదిరెడ్డి వాసు పొలిటికల్ గా మంచి లైఫ్ లీడ్‌ చేస్తున్నారని చెప్పాలి. లోకేష్ త‌ర్వాత ఇంత మంచి ఛాన్స్ ఆదిరెడ్డి వాసుకే ద‌క్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: