ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ అత్యంత దారుణంగా తయారయింది. ఎప్పుడు ఆ పార్టీ నేతలకు ఏం జరుగుతుందో అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. అయితే ఇలాంటి నేపథ్యంలో... వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు.. తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట. అయితే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన.. ఎంపీ లను కాకుండా... రాజ్యసభ సభ్యులను చంద్రబాబు టార్గెట్ చేశారట.

ప్రస్తుతం... దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలలో.. ఎక్కువగా రాజ్యసభ స్థానాలను వైసీపీ కలిగి ఉంది.  అందుకే వైసిపి పార్టీ రాజ్యసభ సభ్యులను టార్గెట్ చేసిందట తెలుగుదేశం పార్టీ. అటు రాజ్యసభలో బీజేపీ పార్టీకి.. పెద్దగా సంఖ్య బలం లేదు.  ప్రతి విషయానికి వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సి వస్తోంది. మొన్నటి వరకు నవీన్ పట్నాయక్... బిజెపికి సపోర్ట్ ఇచ్చాడు. కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో.. బిజెపి ఒడిశాలో గెలవడంతో... బిజెపికి దూరం ఉంటున్నారట నవీన్ పట్నాయక్.

 అందుకే ఇప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యులను.. ఎన్డీఏ కూటమి  టార్గెట్ చేసినట్లు సమాచారం. టిడిపి లేదా బిజెపి.. అవసరం అనుకుంటే జనసేన పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారట.ఇందులో భాగంగానే ప్రస్తుతం నలుగురు ఎంపీలు... చంద్రబాబు టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. విశాఖ ప్రాంతానికి చెందిన గొల్ల బాబురావు, అలాగే నెల్లూరుకు చెందిన బీద మస్తాన్ రావు... టిడిపిలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారట.

 అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్ కృష్ణయ్య, కడపకు చెందిన మేడ మల్లికార్జున రావు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరో వారం రోజుల్లో వీరందరూ.. టిడిపిలో చేరుతారట. అటు అంబానీ కోటాలో వైసిపి ద్వారా రాజ్యసభ సభ్యులైన పరిమల్ సపోర్ట్ ఎలాగో బిజెపికే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక మిగిలిన వైసీపీ నేతలు అందరూ కచ్చితంగా బిజెపికే సపోర్ట్ చేస్తారు. ఇందులో భాగంగానే ఢిల్లీకి చంద్రబాబు వెళ్లినట్లు తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లి బాబు వచ్చిన తర్వాత.. చేరికల కార్యక్రమం ప్రారంభమవుతుందనిసమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: