ప్రస్తుతం తెలుగు మీడియాలోను.. తెలుగు సోషల్ మీడియాలోనూ ఎక్కడ చూసినా రెండు వార్తలే బాగా హైలైట్ గా కనిపిస్తున్నాయి. ఒకటి గత ప్రభుత్వాలు చేసిన అక్రమాలు. రెండు అక్రమ సంబంధాలు. తెలంగాణలో ఎన్నికలు ముగిసి.. కొత్త ప్రభుత్వం వచ్చి 7 - 8 నెలలు దాటేసింది. ఆంధ్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అవుతుంది. మీడియాకు అంత రంజైన వార్తలు లేవు. అంతా చప్పగా ఉంది. తెలంగాణలో అయితే బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతూ ఉండడంతో ఇక్కడ కాస్త పొలిటికల్ మూమెంట్ వేడెక్కుతోంది. ఆంధ్రలో అయితే వాతావరణం అంతా చ‌ప్పగా కనిపిస్తోంది. ఇలాంటి టైంలో తెలుగు మీడియాకు, తెలుగు సోషల్ మీడియాకు రెండు వార్తలు.. ఆవిరెండు కూడా అక్రమ సంబంధాలకు సంబంధించినవి కావటం విశేషం. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య చౌదరి లివింగ్ రిలేషన్ వార్తను గత వారం రోజులుగా తెలుగు మీడియా ఎంత హైలెట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం.


అటు రాజ్ తరుణ్, ఇటు లావణ్య ఇద్దరిని పెట్టి ఇంటర్వ్యూలు చేస్తూ వాళ్ల గురించి రకరకాల వీడియోలు వదులుతూ నానా రచ్చ చేస్తుంది. లావణ్య చౌదరి బయటికి వచ్చాక రాజ్ తరుణ్‌కు కొందరు హీరోయిన్లతో అక్రమ సంబంధాలు అంటూ చెబుతున్నారు. అలాగే లావణ్యకు కూడా మస్తాన్‌వ‌ల్లి అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని రాజ్ తరుణ్ చెబుతున్నాడు. అలాగే రాజ్ తరుణ్ తో కొత్తగా ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్‌కు కూడా వేరే బంధాలు ఉన్నాయంటూ మరికొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. పైగా ఈ కేసును కళ్యాణ్ దిలీప్ సుంకర టేక్ అప్ చేయడంతో మామూలు రంజుగా లేదు. మీడియా, సోషల్ మీడియా అంతా వేడెక్కిపోతోంది. ఇక ఆంధ్రలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మధ్య అక్రమ సంబంధం అంటూ హడావుడి మొదలైంది. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఎవరు దీనిపై అంతగా స్పందించలేదు.


ఇప్పుడు శాంతి మొదటి భర్త మదన్మోహన్ స్వయంగా తన భర్య‌ శాంతికి పుట్టిన బిడ్డ విజయసాయిరెడ్డి తండ్రి అవునో.. కాదో తేల్చాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాయడంతో.. దీనిపై రచ్చ మామూలుగా లేదు. పైగా విజయ్ సాయి రెడ్డికి డీఎన్ఏ టెస్ట్ చేయాలంటూ మీడియా ముందుకు వచ్చి యాగి చేయడంతో.. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సోషల్ మీడియా ఒక రేంజ్‌లో యాక్టివ్ అయింది. ఈ విషయంలో వైసీపీ సోషల్ మీడియా అంతా సైలెంట్ అయిపోయింది. విజయసాయిని డిఫెండ్ చేసే వారే లేరు.. పైగా విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. అలా ఇప్పుడు తెలుగు సోషల్ మీడియాకు రాజ్ తరుణ్, అటు విజయసాయిరెడ్డి అక్రమ సంబంధాల విషయాలే మంచి న్యూస్ గా మారాయి. అలాగే తెలుగు ప్రజలు కూడా వీటి గురించి ఎక్కడ చూసినా చర్చ పెడుతూ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మరింత రచ్చ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: