ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి ఈసారి కూటమి ప్రభుత్వంలో ఒక్క అచ్చెం నాయుడుకి మాత్రమే క్యాబినెట్ పదవి దక్కింది. కేంద్ర మంత్రిగా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉంటే.. రామ్మోహన్ బాబాయ్ అచ్చెం నాయుడు కీలకమైన వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఒక్క అచ్చెం న్నాయుడుకి మాత్రమే మంత్రి పదవి దక్కింది. ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లాలో కాళింగ సామాజికవర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత ఎక్కువ. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఈ సామాజిక వర్గం నుంచి పలువురు మంత్రులు అయ్యారు.


వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు ఇదే సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్గా ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో కాళింగ సామాజికవర్గం నుంచి ఎవరికీ కీలక పదవులు దక్కలేదు. అయితే తెలుగుదేశం నుంచి ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, ఆముదాలవలస నుంచి కూర రవికుమార్ ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఇద్దరూ ఉత్తరాంధ్రలో అందులోనూ శ్రీకాకుళం జిల్లాలో బాగా వెనకబడిన కాళింగ సామాజిక వర్గానికి చెందిన నేతలే. కాళింగ సామాజిక వర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇచ్చాపురం నుంచి అశోక్ వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.


పైగా 2019 ఎన్నికలలో జగన్ ప్రభంజనంలోనూ ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే కూన రవికుమార్ కాళింగ సామాజికవర్గంలో డేరింగ్ అండ్ డైనమిక్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి పార్టీని సమర్థవంతంగా నడిపించారు. పార్టీ కోసం కేసులు ఎదుర్కొన్నారు కూడా. పైగా సామాజిక వర్గంలో దూకుడుగా వెళతారన్న పేరున్న.. క్రేజ్ ఉన్న.. నాయకుడిగా కొనసాగుతున్నారు. మరి చంద్రబాబు కాళింగ సామాజిక వర్గానికి క్యాబినెట్లో అవకాశం ఇవ్వాలనుకుంటే.. ఆ ప‌దవి అశోక్ వర్సెస్ రవికుమార్ లో ఎవరికి దక్కుతుంది అన్నది ప్రస్తుతానికి అయితే సస్పెన్స్ గానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: