తాజాగా రాష్ట్రంలోని పరిశ్రమలు, కర్మాగారాలు, ఇతర సంస్థలలో లోకల్ ఎంప్లాయిమెంట్ ని ప్రభావితం చేసే సంచలనాత్మక బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. "స్టేట్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ లోకల్ కాండిడేట్స్ ఇన్ ఇండస్ట్రీస్, ఫాక్టరీస్, అండ్ అథర్ ఇష్టబ్లిష్మెంట్స్‌ బిల్" అనే ముసాయిదా బిల్లును కర్ణాటక మంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లు కన్నడిగులకు ఉపాధిలో ప్రాధాన్యతనిస్తుంది. మేనేజ్‌మెంట్ ఉద్యోగాలలో 50%, నాన్ మేనేజ్‌మెంట్ ఉద్యోగాలలో 75% కన్నడిగులకు రిజర్వ్ చేయాలని ఈ బిల్లు చెబుతోంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ప్రైవేట్ రంగం, ఐటీ ఇండస్ట్రీ కూడా ఉన్నాయి.

ఒక ఎక్స్‌ పోస్ట్‌లో, కర్ణాటక కార్మిక మంత్రి సంతోష్ లాడ్ మాట్లాడుతూ, "ప్రయివేట్ రంగాలలో కన్నడిగులకు ఉద్యోగ రిజర్వేషన్ల బిల్లును కేబినెట్ సమావేశంలో ఆమోదించడం సంతోషంగా ఉంది, కన్నడిగులకు రాష్ట్రంలో ప్రైవేట్ రంగం ఉద్యోగాల్లో 50% నుంచి 75% రిజర్వేషన్లు లభిస్తాయి." అని అన్నారు.నియామకంలో కన్నడిగులకు ప్రాధాన్యత ఇవ్వని వ్యాపారాలకు జరిమానా విధించాలని కూడా బిల్లు నొక్కి చెప్పింది. చట్టాన్ని ఉల్లంఘించిన కంపెనీలకు రూ.10,000 నుంచి రూ.25,000 వరకు జరిమానా విధిస్తారు. స్థానిక యజమాని నుంచి బిల్లు అవసరాలను తీర్చే వరకు రోజువారీ జరిమానా రూ.100 వసూలు చేస్తారు.

కర్ణాటకలో, కాల్ క్యాండిడేట్ అనేవారు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ముసాయిదా బిల్లు ప్రకారం కన్నడ మాట్లాడినంత మాత్రాన ఒక వ్యక్తి కన్నడిగుడు కాలేడు. వ్యక్తి తప్పనిసరిగా నోడల్ ఏజెన్సీ ద్వారా పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత సాధించడానికి 15 సంవత్సరాలు రాష్ట్రంలో నివసించాలి. కంపెనీలు మినహాయింపులను అభ్యర్థించవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం కొన్ని సడలింపులను అనుమతించవచ్చు. అయితే, గ్రూప్ 'సి', 'డి' బ్లూ కాలర్ ఉద్యోగాల కోసం, అన్ని ప్రైవేట్ కంపెనీలు తప్పనిసరిగా కన్నడిగులను మాత్రమే నియమించుకోవాలి. ఫిబ్రవరిలో, కన్నడ, సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ ఎస్. తంగడగి అసెంబ్లీలో మాట్లాడుతూ, కర్ణాటకలోని అన్ని మల్టీ నేషనల్‌ కంపెనీలు తప్పనిసరిగా కన్నడిగ ఉద్యోగుల సంఖ్యను నోటీసు బోర్డులపై ప్రదర్శించాలి. ఈ కంపెనీల అనుమతులు పాటించకపోతే వాటిని రద్దు చేయవచ్చని కూడా ఆయన చెప్పారు.

అయితే ఈ నిబంధనలను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తిరస్కరించారు. బెంగళూరును గ్లోబల్ సిటీగా అభివర్ణించిన ఆయన, ప్రభుత్వం వద్ద అలాంటి ప్రణాళికలేవీ లేవని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: