ఆంధ్రప్రదేశ్లోని 2024 ఎన్నికలలో వైసిపి పార్టీ కేవలం 11 స్థానాలనే సంపాదించుకొని గోరంగా ఓడిపోయింది.. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం వైసిపి పార్టీ హయాంలో జరిగిన కొన్ని విషయాల పైన శ్వేత పత్రాలను కూడా విడుదల చేస్తూ వస్తున్నారు.. ఈనెల 22వ తేదీన అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఇందులో ఇసుక, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇతరత అంశాల పైన కూడా శ్వేత పత్రాలను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.. గత కొద్దిరోజుల నుంచి సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా జగన్ పర్యటించారు. అలాగే బెంగళూరు వంటి ప్రాంతాలలో కూడా పర్యటిస్తూ ఉన్నారు.



వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి అసలు పరీక్ష రాబోతోంది.. ఈరోజు వచ్చేసరికి 18, 19 ,20 ,21 ఈ నాలుగు రోజులలో బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి తిరిగి వస్తారా రారా అనేది ప్రశ్నగా మారింది. ఎందుకంటే 22వ తారీఖున ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ముఖ్యంగా డైరెక్ట్ బడ్జెట్టా లేకపోతే ఓటింగ్ బడ్జెట్ అనే విషయం తెలియాల్సి ఉన్నది.. అలాగే ఈ విషయం పైన కూడా చర్చ జరుగుతుందట. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు మొదలు కాబోతున్నాయి.


అలాగే టిడిపి పార్టీ కూటమిలో భాగంగా శ్వేత పత్రాలను కూడా అసెంబ్లీలో తీసుకురావాలనే విధంగా ప్లాన్ చేశారట. ల్యాండ్ టైటిలింగ్ యాక్టివ్ వంశీ విషయాలను కూడా ఇందులో పెట్టి ఓకే చేయబోతున్నారు. ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలకు జగన్ అటెండ్ అవుతారా లేదా అనే విషయం చర్చనీయాంశంగా మారింది. అటెండ్ కాకపోతే అహంభావన కిందే జనంలో మిగిలిపోతారు.. అటెండ్ అయితే బాధ్యతగా ఉంటుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. మరి వైసిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారనే విషయం చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: