ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... వైసిపి పార్టీ ఓడిపోయిన తర్వాత... అందులో ఉన్న లీడర్లు చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. చాలామంది నేతలు జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తనను మీడియా ముందే వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే కేతిరెడ్డి, పేర్ని నాని లాంటి తదితర ఎమ్మెల్యేలు... జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కంటే ముందు దారుణమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వైసీపీ ఓడిందని తెలిపారు.

ఇక ఇలాంటి నేపథ్యంలో.. ఒక్కో కీలక నేత టిడిపి లేదా బిజెపిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట. అయితే ఈ లిస్టులో దేవినేని అవినాష్ కూడా చేరిపోయినట్లు సమాచారం అందుతుంది. మొన్నటి ఎన్నికల్లో  టిడిపి అభ్యర్థి గద్దర్ రామ్మోహన్ చేతిలో.. దేవినేని అవినాష్ 50,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అంతకుముందు కొడాలి నాని చేతిలో టిడిపి అభ్యర్థిగా కూడా అవినాష్ ఓడిపోయాడు.

అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే.. టిడిపి పార్టీకి గుడ్ బై చెప్పి... జగన్ చెంతలో చేరాడు దేవినేని అవినాష్. వాస్తవానికి దేవినేని అవినాష్ కుటుంబం మొత్తం టిడిపిలోనే ఉంది... కానీ కొడాలి నాని మాట విని వైసీపీ పార్టీలోకి వెళ్ళాడు దేవినేని అవినాష్. అయితే ఇప్పుడు యూటర్న్ తీసుకున్న దేవినేని అవినాష్... తన తండ్రి దివంగత నేత దేవినేని రాజశేఖర్ కు సన్నిహితులైన గోరంట్ల బుచ్చయ్య కు టచ్ లోకి వెళ్ళారట.


గోరంట్ల బుచ్చయ్య అలాగే గద్దె బాబురావు ద్వారా టిడిపి పార్టీలో చేరేందుకు... సంకేతాలు పంపిస్తున్నారట. అయితే.. ఈ విషయం నారా లోకేష్  వరకు వెళ్లిందని సమాచారం. దీంతో దేవినేని అవినాష్ రాకను....  నారా లోకేష్ వ్యతిరేకిస్తున్నారని సమాచారం. టిడిపి పార్టీకి వెన్నుపోటు పొడిచి బయటికి వెళ్లిన నాయకులు  కూడా... మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి రాకూడదని... నారా లోకేష్ తేల్చి చెప్పారట. తన పాదయాత్ర సమయంలో కూడా దేవినేని అవినాష్ ఓవరాక్షన్ చేశాడని నారా లోకేష్ ఫైర్ అవుతున్నారట. దీంతో దేవినేని అవినాష్ పరిస్థితి దారుణంగా తయారయిందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: