తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా కొలువుదిరింది.  రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి రెండవ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు ఎన్నికలు జరిగితే రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కేసీఆర్ సీఎం అయ్యారు. ఆ తర్వాత మూడవసారి కూడా ఆ పార్టీ వస్తుందని భావించారు కానీ ప్రజలు అనూహ్య తీర్పు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.  దీంతో కాంగ్రెస్ వారు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే నాలుగు గ్యారంటీలు నడుస్తున్న తరుణంలో ఐదవ గ్యారంటీ రుణమాఫీ కూడా  చేయడానికి సిద్ధమయింది.  కాంగ్రెస్ పార్టీ పాలన నడుస్తున్న క్రమంలో, రేవంత్ రెడ్డి సరికొత్త ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్లాన్ ప్రకారమే ఆయన ముందడుగు వేస్తున్నారట. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా..  

ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నాయకులంతా కాంగ్రెస్ లో చేరుతున్నారు.  అయితే ఈ చేరికలను రేవంత్ రెడ్డి తో పాటు మంత్రి పొంగులేటి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిలు మాత్రమే ఎక్కువగా చూసుకుంటున్నారు.  ఎక్కడ చేరికలు జరిగినా, వీరు తప్ప సీనియర్ నేతలైనటువంటి కొంతమంది మంత్రులు, నాయకులు అసలు కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో చేరికలను వద్దని చెప్పినా కానీ రేవంత్ వినిపించుకోకుండా వచ్చిన వారందరిని చేర్పించుకుంటున్నారు. అంతేకాదు మొత్తం బీఆర్ఎస్ నుంచి 26 మందిని ఖచ్చితంగా చేర్చుకుంటామని ఆయన చెబుతూ వస్తున్నారు.

అసలు రేవంత్ ఇలా చేరికలు ఎందుకు చేస్తున్నాడో అని మంత్రులు, ఎమ్మెల్యేలలో విపరీతమైనటువంటి చర్చ నడుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆయన పరిపాలన లో ప్రాబ్లమ్స్  అన్నట్టు తెలుస్తోంది.  ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న,  పార్టీలో  ఉన్నటువంటి సీనియర్లు ఇతర నాయకులు అడ్డుపడుతున్నారు.  ఈ విషయాన్ని అధిష్టానానికి చెప్పి మరి రేవంత్ రెడ్డి స్థానాన్ని తగ్గిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికి 12 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. ఇంకా ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. దీనికోసం కూడా సొంతంగా రేవంత్ నిర్ణయాలు తీసుకొనివ్వడం లేదు.ఈ క్రమంలో అత్యధికంగా చేరికలు చేసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పెద్దగా సంబంధం లేకుండా, పార్టీలోకి  వచ్చినటువంటి ఎమ్మెల్యేల బలంతో  తమకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చని ఆలోచన చేస్తున్నారట.

అంతేకాకుండా రేవంత్ వ్యవహార శైలిపై కాస్త అనుమాన పడుతున్న ఏఐసిసి ఈ మధ్యకాలంలోనే త్రీమెన్ కమిటీ విచారణకు కూడా నియమిచ్చిందట. అయితే ప్రస్తుతం ఉన్న 65 మంది ఎమ్మెల్యేలలో సీనియర్ కాంగ్రెస్ నేతలు, ప్రస్తుత మంత్రులు మినహా, మిగతా ఎమ్మెల్యేలు రేవంత్ కు మద్దతు ఇస్తారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను  పార్టీలో చేర్చుకుంటే రేవంత్ 60 పైచిలుకు ఎమ్మెల్యేల బలం వస్తుంది. అందుకే ఎవరు చెప్పినా వినకుండా చేరికలను చేపట్టారని సమాచారం. ఇలా అయితేనే  రేవంత్ చెప్పే విషయాలను అధిష్టానం కూడా పట్టించుకుంటుందని, దీంతో తనకు నచ్చినట్టు పాలన చేయవచ్చని ఆలోచన చేసి చేరికలను విపరీతంగా ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: