ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. ఇదే తరుణంలో వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగోసారి సీఎం గా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా మొత్తం మంత్రి వర్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఏపీలో అద్భుతమైన పాలన అందించే దిశగా అడుగులు వేస్తున్నారు.  కానీ ప్రభుత్వానికి సంబంధించిన పనులపై కానీ, చేసే తప్పులకై కానీ స్పందించడానికి వైసీపీ నాయకులు ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఒకరిద్దరు నాయకులే చిన్నాచితక ప్రెస్ మీట్స్ పెట్టి  స్క్రిప్టులు చదువుతున్నారే తప్ప గట్టిగా ఎవరు కూడా మాట్లాడడం లేదు.

  వైసీపీ ప్రభుత్వంలో గజ్జ కట్టుకొని గట్టిగా మాట్లాడినటువంటి కొంతమంది నేతలు కనీసం కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, అధికారం ఉంటేనే వీళ్లు మాట్లాడతారా?అధికారం లేకపోతే ప్రజల వైపున ఉండరా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి.  సిక్కోలు నుంచి మొదలు చిత్తూరు వరకు ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బొత్స సత్యనారాయణ,  ధర్మాన, పెద్దిరెడ్డి ఇలా ఎంతోమంది సీనియర్లు సైలెంట్ గా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వీల్లే కాకుండా రోజా, నాని, వంశీ ఇలా చాలామంది సీనియర్లు  సైలెంట్ అయిపోయి వారి పని వారి చూసుకుంటున్నారట.

 కొంతమంది రాష్ట్రం దాటి బయటకు వెళ్ళిపోతే, మరి కొంతమంది రాష్ట్రంలో ఉన్నా కానీ వారు ఎక్కడ ఉన్నారో తెలియకుండా టైంపాస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వీరు ఇంత సైలెంట్ అయిపోవడానికి ప్రధాన కారణం  ఒకటి ఉన్నదనే అనుమానం అందరికీ కలుగుతోంది. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో  ఎంతోమంది సీనియర్ నేతలు ప్రజలపై పడి దోచుకొని తిన్నారు.  భూములు, రియల్ ఎస్టేట్ల ద్వారా అత్యధికంగా సంపాదించారు. అలాగే అధికారంలో ఉన్న సమయంలో ఎంతోమందిని ఇబ్బందులకు గురి చేశారు. ఈ  విధంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన నిర్వాహకమే ప్రస్తుతం వారిని వెంటాడుతోందని,  బయటకు వస్తే టిడిపి టార్గెట్ చేసి మరీ వారిని జైలుకు పంపిస్తుందని భయంతో వారు అస్సలు బయటకు రావడంలేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: