అలాంటి సంఘటనలు ఆమె కెరియర్ లో చాలానే ఉన్నాయి. అయితే తాజాగా వైసిపి పార్టీ ఓల్పోయిన త ర్వాత కూడా... మాజీ మం త్రి రోజా... తన ప్రవర్తనను ఎక్కడ మార్చుకున్నట్లు కనిపించడం లేదు. తమిళనాడులో వైసిపి నాయకురాలు మాజీ మంత్రి రోజా... చేసిన పని ఇప్పుడు వివాదంగా మారింది. తనను సెల్ఫీ అడిగిన మున్సిపల్ కార్మికులను.. ఛీ కొట్టింది మాజీ మంత్రి రోజా.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం.. రోజా కొంపముంచుతోంది. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచెందూర్ సుబ్రమణ్య స్వామి ఆలయం కు మాజీ మంత్రి రోజా అలాగే ఆమె భర్త ఇవాళ పండుగ సోమ వారం కాబట్టి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభిషేకం చేయించుకున్నారు రోజ దంపతులు. అయితే ఆలయానికి రోజా దంపతులు రావడంతో... జనాలంతా చూసే ఎందుకు ఎగబడ్డారు.
అక్కడే ఉన్న మున్సిపల్ కార్మికులు... రోజాతో సెల్ఫీ దిగే ఎందుకు ఎగబడ్డారు. అయితే పారిశుద్ధ కార్మికులను... చి కొడుతూ.. దగ్గరకు రావద్దని.. రోజా ఆదేశించారట. ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఏపీలో ఓడిపోయిన కూడా... మాజీ మంత్రి రోజా.. పొగరు తగ్గలేదని నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. కార్మికులను అలా చీ కొట్టుడమేంటని... మండిపడుతున్నారు. మరి ఈ వివాదం పై మాజీ మంత్రి రోజా సెల్వమనీ ఎలా స్పందిస్తారో చూడాలి.