ఇటీవల ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం తన మార్క్ పరిపాలనను పరుగులు పెట్టిస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ అభివృద్ధి ధ్యేయంగా చేసుకొని అడుగులు వేస్తున్నారు. దీంతో పాటుగా సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తూ ప్రత్యర్ధులు సైతం అవాక్కయ్యలా మంచి ప్లాన్ తో ముందుకు పోతున్నాడు. ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని త్వరలో ప్రారంభించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే దీనిపై త్వరలో ఓ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇక దేనిని లైన్ లో పెడుతూనే మరో పథకాన్ని షురూ చేస్తున్నారు చంద్రబాబు. విషయం ఏమిటంటే ఎస్సీ, ఎస్టి, బడుగు బలహీన డ్వాక్రా మహిళలకు తాజాగా కూటమి ప్రభుత్వం శుభవార్తను తీసుకొచ్చింది. రుణ పరిమితిలో భాగంగా 2 లక్షల రూపాయల నుండి 5 లక్షల వరకు రుణాన్ని ఇకనుండి ఇవ్వనన్నారు. దీనిని వాయిదాల రూపంలో చెల్లించిన పిదప మరో కొత్త రుణాన్ని ఇవ్వనున్నారు. ఈ మొత్తం రుణానికి జీరో వడ్డీ వర్తింపబడుతుంది. 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మహిళల కొరకు దాదాపు 250 కోట్ల రుణం ఇవ్వాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టుగా సీఎం అధికారులకు నిర్దేశించడం జరిగినది.

ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించిన పత్రాల పైన ఆయా సంబంధిత వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంతకం చేసినట్టు సమాచారం. ఈ పథకం ద్వారా లక్షలాదిమంది మహిళలు లబ్ధి పొందనున్నారు. ఈ రుణం పొందే క్రమంలో మహిళలు ఎటువంటి జీవనోపాధినైనా ఎంపిక చేసుకోవచ్చు. అర్హులైన మహిళలు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆంధ్ర మహిళల సంక్షేమమే ధ్యేయంగా బాబు అడుగులు వేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. చూడాలి మరిిి ఆంధ్రప్రదేశ్ మహిళలు ఈ సువర్్ణ్ అవకాశాాాన్ని ఎలా విిిిినియోగిగియో

కుంటారో.

మరింత సమాచారం తెలుసుకోండి: