గత కొన్ని నెలల క్రితం తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ పేరు మాత్రమే. తెలంగాణ ప్రత్యేక  రాష్ట్రాన్ని తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేసి రాష్ట్రాన్ని సిద్ధింప చేశారు. దీంతో కొత్తగా ఏర్పడిన, రాష్ట్రానికి రెండు పర్యాయాలు ఆయనే సీఎం అయ్యారు.  ఎన్నో అభివృద్ధి పనులు తీసుకువచ్చారు అంతేకాకుండా మరెన్నో అప్పులు కూడా చేశారు.  ఇలా రాష్ట్రాన్ని ఓ మోస్తారుగా తీర్చిదిద్దిన కేసీఆర్ అహంకార భావమే మూడోసారి ఎన్నికల్లో ఓడిపోయేలా చేసింది. 

అంతేకాకుండా ఆయన కుటుంబ పాలన కూడా మైనస్ గా చెప్పవచ్చు. ఈ విధంగా కేసీఆర్ తెలంగాణ ప్రజలు గొర్రెలు, నేనేం చెప్పిన మళ్లీ నాకు ఓటు వేస్తారు అనే అహంకార భావంతో ముందుకు వెళ్లారు. దీంతో ప్రజలు టిఆర్ఎస్ ను దారుణంగా తిప్పి కొట్టి కాంగ్రెస్ కు పట్టం కట్టారు. దీంతో అధికారం కోల్పోయిన కేసీఆర్ అస్సలు తట్టుకోవడం లేదని తెలుస్తోంది. దీనికి తోడుగా పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర సీనియర్ నాయకులంతా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోతున్నారు. ఈ విధంగా చర్చ నడుస్తున్న తరుణంలో మరో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. అదేంటో చూద్దాం.  

మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు టీఆర్ఎస్ పార్టీ పేరుతో పోటీ చేసినటువంటి కేసీఆర్ ఆ తర్వాత రెండవ సారి ఎలక్షన్స్ వచ్చేసరికి  దాని పేరు బీఆర్ఎస్ గా మార్చారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పేరుతోనే పార్టీ నడుస్తోంది. టిఆర్ఎస్ పేరు ఇప్పటికే మర్చిపోయారు.  ఇదే తరుణంలో మాజీ ముఖ్యమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్ఎస్ కండువాకు బదులు టిఆర్ఎస్ కండువా వేసుకొని ఒక ప్రోగ్రాంలో పాల్గొన్నారు. దీంతో ఇది కాస్త చర్చకు దారి తీసింది.

అసలు బీఆర్ఎస్ పేరు పెట్టడం హరీష్ రావుకి ఇష్టం లేదని టీఆర్ఎస్ అయితేనే బాగుంటుందని ఆయన మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారని తెలుస్తోంది.  మామ కేసీఆర్ ఆయనను పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడ పోయి చివరికి ఓడిపోయాడని  హరీష్ రావు వర్గం భావిస్తున్నట్టు సమాచారం. దీన్ని మనసులో పెట్టుకుని హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదని, టిఆర్ఎస్ కండువా వేసుకొని తిరుగుతున్నారు అనే అనుమానం కూడా  కలుగుతోంది. అయితే తాజాగా పటాన్ చెరువులో కార్యకర్తల సమావేశంలో టిఆర్ఎస్ కండువా వేసుకొని  కనిపించడంతో  అంతా షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: