ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ప్రఖ్యాతిగాంచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆపదమొక్కులవాడిగా ఆపద్బాంధవుడిగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువుదీరి ఉన్నాడు. ఈ క్రమంలోనే కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ప్రముఖులు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలని అనుకుంటూ ఉంటారు. అందుకే సీజన్ తో సంబంధం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు భక్తులతో రద్దీగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన భక్తులందరూ కూడా తమకు తోచిన విధంగా శ్రీవారికి ఇక ముడుపులు సమర్పించుకోవడం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతోమంది సంపన్నులు అటు బంగారు ఆభరణాలను లక్షలాది రూపాయలను కూడా హుండీలో వేయడం చూస్తూ ఉంటాం. ఈ క్రమంలోనే ప్రతిరోజు కోట్ల రూపాయల్లో అటు శ్రీవారికి హుండీ ఆదాయం వస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం భారీగా పెరిగింది అన్నది తెలుస్తుంది. గత ఏడాది మొదటి ఆరు నెలలకు హుండీ ఆదాయం ఎంత వచ్చింది అన్న విషయాన్ని అధికారులు లెక్కించారు.


 ఈ క్రమంలోనే ఈ ఏడాది మొదటి ఆరు నెలలకు గాను ఏకంగా 67.21 కోట్ల రూపాయలు శ్రీవారి హుండీలో చేరినట్లు అధికారులు తెలిపారు. కానుకలు కూడా భారీగా వచ్చాయని వెల్లడించారు. మరోవైపు ఇవాళ తిరుమల లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. కాగా భక్తులు పది కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుందట. కాగా నిన్న ఏకంగా 71,049 మంది భక్తులు అటు శ్రీవారిని దర్శించుకున్నారు అన్న విషయాన్ని అధికారులు వెల్లడించారు. సమ్మర్ హాలిడేస్ కారణంగా ఎక్కువ మొత్తంలో భక్తులు అటు తిరుపతి చేరుకుని శ్రీవారిని దర్శించుకోవడంతో ఇలా ఉండే ఆదాయం కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: