చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య గల అవినాభావ సంబంధాన్ని గురించి జనాలకు ప్రత్యేకంగా ఇక్కడ వివరించాల్సిన అవసరం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారధిగా పనిచేస్తూ ఎన్డీఏ కూటమిని విజయపథంలో నడిపించారు. ఈ క్రమంలోనే ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం సంచలన విజయాన్ని నమోదుచేసింది. ఈ మొత్తం ప్రక్రియలో కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ వందకి 100% సక్సెస్ అయ్యారు. పోటీ చేసిన 23చోట్ల నెగ్గి చరిత్ర తిరగ రాశారు.

చంద్రబాబు ఆపద సమయంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కొండంత భరోసానిచ్చి టిడిపికి ఊపిరి పోసారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రాజకీయ విశ్లేషకులు అన్నవారికి ఇట్టి విషయాలు చాలా బాగా తెలుసును. అయితే పవన్ కళ్యాణ్ సహాయాన్ని బాబు ఏనాడూ మరువలేదు. అవసరం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ పై బాబు తన ప్రేమను ప్రకటించుకుంటూనే వస్తున్నాడు.అంతవరకు బాగానే ఉంది... అయితే తాజాగా ఏపీ రాజకీయాల్లో వినబడుతున్న గుసగుసలు ఏమిటంటే.. బాబుకి, పవన్ కళ్యాణ్ కి మధ్య దూరం పెరిగిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

జనసేన ని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత.. తనదైన మార్క్ పరిపాలనతో ముందుకు దూసుకుపోతున్నాడు. మరోవైపు సీఎం చంద్రబాబు తన పనిలో తాను నిమగ్నమై ఉన్నాడు. ఈ మధ్యకాలంలో వీరు ఇరువురు కలిసి ఒకే వేదిక పైన కనబడిన దాఖలాలు కనిపించడం లేదు. మొన్నటి వరకు చట్టపట్టలేసుకుని తిరిగేవారు సడన్ గా అలా కనబడకపోయేసరికి రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. మొన్నటికి మొన్న అంబానీ వివాహ వేడుకలు మధ్యన మెరిసిన వీరు కలిసి అక్కడ తిరగకపోవడం ఇటువంటి అనుమానాలకు దారితీస్తోంది అనడంలో సందేహం ఏముంది? మరో విషయం ఏంటంటే... వీరు ఎప్పుడు దూరమవుతారా.. ఎప్పుడు వీరి మధ్య దూరి చిచ్చు పెడదామా అని ఓవర్గం కాపు కాసుకుని చూస్తోంది. మరోవైపు పవర్ స్టార్ అభిమానులు తన హీరో ఒక సినిమా అయినా చేయకపోతాడని ఎదురుచూస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: