దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం జగన్.. లోటస్ పాండ్ నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో అప్పటికే బలమైన పార్టీగా వెలుగొందుతున్న కాంగ్రెస్ ని జగన్ తుంగలో తొక్కాడు. వైయస్ మరణం వెనుక కాంగ్రెస్ రాజకీయం ఉందని గ్రహించిన జగన్ ఏకంగా కాంగ్రెస్ పెద్ద తలకాయతోనే పోటీపడి గెలిచాడు. దాదాపు 5 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత 2019 వ సంవత్సరంలో జగన్ ఏపీకి సీఎం అయ్యి రికార్డ్ సృష్టించారు.

ఈ నేపథ్యంలో టిడిపిని ఘోరంగా ఓడించి ఇంటికి పంపించాడు. ఇక జగన్ సీఎం అయిన తర్వాత లోటస్ పాండ్ ని విడిచి పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే అది ఉన్నది హైదరాబాదులో కాబట్టి. గడిచిన 5 సంవత్సరాల పాటు మాజీ సీఎం జగన్ తాడేపల్లి వేదికగా తన పరిపాలన కొనసాగించారు. ఆ మధ్యలో ఆయన లోటస్ పాండ్ వైపు కన్నెత్తి కూడా చూసిన దాఖలాలు మనకి కనబడవు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చేతిలో అత్యంత దారుణంగా ఓడిపోయిన జగన్ తిరిగి లోటస్ పాండ్ కి వెళ్లిపోతాడని అంతా అనుకున్నారు.


కానీ అది జరగలేదు సరి కదా... ఆయన హైదరాబాదు చుట్టుపక్కల కి కూడా వెళ్లలేదని సమాచారం. అవును జగన్ ఓటమి తర్వాత బెంగళూరు యహలంక ప్యాలెస్ కి చెక్కేశారు. ప్రస్తుతం అక్కడి నుండే రాజకీయాలు వెలగబెడుతున్నారు. తనకు రాజకీయంగా కలిసి వచ్చిన లోటస్ పాండ్ వైపు మాత్రం ఆయన కన్నెత్తి చూడడం లేదు. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటంటే... లోటస్ పాండ్ అనేది వైయస్ రాజశేఖర్ రెడ్డి నుండి వారసత్వంగా వచ్చిన ఆస్తి. అందుకే ప్రస్తుతం అక్కడ వైయస్ షర్మిల నివాసం ఉంటున్నారు. ఇక చెల్లెలు ముఖం చూడడం ఇష్టం లేకనే జగన్ అటువైపు పోవడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: