తెలంగాణ రాష్ట్రంలో... గులాబీ పార్టీ ఖాళీ అవుతున్నట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీ అధికారం కోల్పోవడంతో.. ఈ పరిస్థితి నెలకొంది. పది సంవత్సరాల అధికారాన్ని కోల్పోవడమే కాకుండా... మన పార్లమెంట్ ఎన్నికల్లో జీరో స్థానాలకు పడిపోయింది గులాబీ పార్టీ. దీంతో గులాబీ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చాలామంది జారుకుంటున్నారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.


మరో 12 మంది ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ కండువా ఒక అప్పుకుంటారని... సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే..  కాంగ్రెస్ పార్టీలో గులాబీ పార్టీ నేతలు చేరుతున్న నేపథ్యంలో కేసీఆర్ కు భారీ రిలీఫ్ దక్కినట్లు తెలుస్తోంది.  గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ గులాబీ గూటికి... వచ్చింది సిద్ధమవుతున్నారు. ఈ మేరకు క్యాడర్ తో ఇప్పటికే చర్చలు కూడా చేశారట గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.


గత వారం రోజుల కింద... గులాబీ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాకను... తీవ్రంగా వ్యతిరేకించారు గద్వాల్ కాంగ్రెస్ నేతలు. ముఖ్యంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల కాంగ్రెస్ అభ్యర్థిగా నిలుచున్న... సరిత ... రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి ఏడ్చారట.

 

బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే... తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారట. అయినప్పటికీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని...  కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన తర్వాత... గద్వాల ఎమ్మెల్యే కు అసలు అక్కడ స్వేచ్ఛ  లేదట. అలాగే,తన ఇంట్లో, కార్యాలయంలో కేసీఆర్‌తో దిగిన ఫొటోలను ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పెట్టుకున్నారు. అయితే వాటిని కార్యకర్తలు తొలగిద్దామని చూస్తే ఆయన వద్దని వారించారట. దీంతో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌‌లో ఎక్కువ రోజులు కొనసాగలేరని ఆయన వర్గం చర్చించుకుంటున్నారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

BRS