లక్ష్మీపార్వతి అనగానే అందరికీ సీనియర్ ఎన్టీఆర్ రెండవ భార్య గా గుర్తు ఉండనే ఉంటుంది.. అలాగే వైసిపి పార్టీకి సపోర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు టిడిపి నేత చంద్రబాబు పైన విరుచుకుపడుతూ ఉంటుంది.. అయితే ఇప్పుడు తాజాగా కొన్నీ మీడియా సంస్థల  పైన ఈమె ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే ఆంధ్ర యూనివర్సిటీ తనకు ఇచ్చిన గౌరవ ఆచార్య పోస్ట్లను సైతం చాలా వెక్కిరిస్తూ కొన్ని మీడియాలు పేపర్లు  అసత్య కథనాలను కూడా ప్రచారం చేస్తూ వైరల్ గా చేస్తున్నారని  తెలుగు ,సంస్కృత అకాడమీ మాజీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి ఫైర్ అయ్యారు.


వాస్తవాలను మరుగుపరిచిన ఏయూ లో తనకు జీతంతో కూడిన ఆచార్య పోస్టులను సైతం కట్టబెట్టినట్లుగా రాయడం సిగ్గుచేటు కాదా అంటూ ఆమె నిన్నటి రోజున ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.. డబుల్ పిహెచ్ఏ చేసిన తన లాంటి వ్యక్తులకు సైతం ఇలాంటి గౌరవం ఇస్తారు అంటూ ఇది గౌరవ ఆచార్య యుజిసి నిబంధనల ప్రకారమే ఇచ్చారు అంటూ ఆమె తెలియజేసింది. తెలుగు సాంస్కృతి భాషలలో ప్రావీణ్యం కలిగినటువంటి ఎన్నో పుస్తకాలు రచించిన వారి విద్యార్థులకు మార్గదర్శకులు అవుతారని కూడా ఆమె తెలియజేసింది. ఇలాంటి వారినే గౌరవ ఆచార్యగా నియమించింది అంటూ తెలియజేసింది.



ఈ నిబంధనలను యూజీసి కొత్త మార్గదర్శకాలను ప్రధాని మోదీ చేర్చారని విషయాన్ని కూడా గుర్తుచేసింది.. ఒకవేళ ఈ మార్గదర్శకాలను కొన్ని మీడియా సంస్థలు  అంగీకరించకుంటే వాటిని రద్దు చేయాలని కూడా తెలియజేసింది. ఏపీ సీఎంతో ప్రధాన మోడీకి ఒక లేఖ రాగించాలని కూడా ఆమె డిమాండ్ చేయడం జరుగుతోంది. గౌరవ సూచకంగా ఇస్తున్న పోస్టుకు సైతం ఎలాంటి రూల్ ప్రకారం జీతం ఇస్తారో మీడియా సంస్థలే తెలియజేయాలి అంటూ ఆమె ఫైర్ అయ్యింది.. ఇండియాలో ఏయుకి మూడవ స్థానం దక్కినప్పుడు కొన్ని వార్తాపత్రికలు కేవలం రాజకీయాలతో బుడద జల్లే విధంగా ఉన్నదంటూ ఆమె తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: