ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీని అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు.. ముఖ్యంగా మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిని కాకుండానే మరికొన్ని వాటిని కూడా అమలు చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుదారులకు ఏపీ సీఎం చంద్రబాబు ఒక గుడ్ న్యూస్ తెలియజేసింది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఇకపైన బియ్యంతో పాటు కందిపప్పు చెక్కర కూడా ఇవ్వబోతున్నారట.. అయితే వచ్చే నెల నుంచి ఉచితంగా బియ్యంతో పాటు సబ్సిడీ పైన కందులు చక్కెర పంపిణీ చేసే విధంగా ఏపీ గవర్నమెంట్ నిర్ణయించుకుంది.



అయితే ధరల విషయానికి వస్తే కిలో కందిపప్పు  రూ.67 రూపాయలకు ఇవ్వగా అలాగే అర్థ కేజీ చక్కెర పంపిణీ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అలాగే చెక్కెర పప్పు సరఫరా చేసేందుకు కోసం కాంట్రాక్టర్ల నుంచి టెండర్లను సైతం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వారంలోనే అందుకు సంబంధించి ప్రక్రియ కూడా పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఏపీ ప్రభుత్వం. ముఖ్యంగా ఈనెల 22వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఈ సమయంలోనే క్యాబినెట్లో పలు రకాల సమావేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.


గత ప్రభుత్వంలో కేవలం బియ్యం , చక్కెర మాత్రమే ఇస్తూ ఉండేవారు.. కానీ కూటమి ప్రభుత్వంలో బియ్యం చక్కెరతో పాటు కందిబేల్లును కూడా ఇవ్వబోతున్నట్లు తెలియజేశారు. అలాగే రాబోయే రోజుల్లో మరికొన్ని వస్తువులను కూడా తీసుకువచ్చే విధంగా చేయబోతున్నామంటూ ఏపీ ప్రభుత్వం తెలియజేస్తోంది. ప్రజలకు మంచి చేయడం కోసమే ప్రజలు మమ్మల్ని ఎంచుకున్నారని అందుకే వారి అవసరాలకు కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నామంటూ తెలియజేశారు. అలాగే ఉచిత బస్సులు కూడా ఆగస్టు 15 నుంచి ప్రారంభించబోతున్నామని.. తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేయబోతున్నామని.. మహిళలకు 1500 రూపాయలు ఇచ్చేలా కూడా త్వరలోనే నివేదికలు ఇవ్వబోతున్నామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: