ముఖ్యంగా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ హిత బోధ చేస్తోంది. అయినను పోయి రావాలి హస్తి నాకు అన్నట్టుగా ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన తీరు ఉంది అంటూ షర్మిల విమర్శించడం జరిగింది..NDA కూటమిలో పెద్దన్న పాత్రగా ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన మీరు... కేవలం ఢిల్లీ చుట్టూ మాత్రమే తిరుగుతున్నారు అంటూ ఆమె ప్రశ్నించింది?.. అలాగే ముక్కు పిండి విభజన సమస్యలను పరిష్కరించాల్సింది పోయి బిజెపి పెద్దలకు సలాం కొడుతూ తిరుగుతున్నావు అంటూ ఫైర్ అయ్యింది.
కేంద్రంలో రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడి ఇప్పటికి నెలరోజులు అవుతూ ఉన్న అటు మోడీ గాని ఇతర మంత్రులతో కానీ కనీసం ఒక్క హామీ ఎందుకు ప్రకటించడం లేకపోయారు అంటూ ఆమె ప్రశ్నించింది?.. గెలిచిన రోజు నుంచి ఇప్పటికి నాలుగు సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక ప్రకటన కూడా తీసుకురాలేదు అంటూ ఆమె ఫైర్ అయ్యింది. విశాఖ ఉక్కు ప్రైవేటు కరణం కాదు అంటూ కేంద్రమంత్రి పెద్దలతో చెప్పించగలరా అంటూ ఆమె ప్రశ్నించింది?. అలాగే పోలవరం ప్రాజెక్టుల పైన, రాజధాని నిర్మాణం పైన సహాయమేంటో చెప్పగలిగారా అంటూ ఆమె ప్రశ్నిస్తోంది?.. ఒడ్డు దాటేదాకా ఓడ మల్లన్న దాటేశాక బోడి మల్లన్న అనే పరిస్థితి ఏర్పడింది అంటూ తెలిపారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి అంటూ ఆమె హితబోధ చేస్తోంది.