ప్రత్యేక హోదా గురించి తుది క్లారిటీ రావాల్సిందేనని చెప్పవచ్చు. ప్రత్యేక హోదా రాని పక్షంలో ప్రత్యేక హోదాకు సమానమైన స్థాయిలో ప్రయోజనాలు దక్కేలా అడుగులు పడాల్సి ఉంది. కూటమి ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే మంచిదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ మిత్ర పక్షమే అయినా ప్రజల మనోభావాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత సైతం కూటమిపై ఉంది.
ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రంలో వేగంగా కంపెనీల ఏర్పాటు దిశగా అడుగులు పడే అవకాశం అయితే ఉంటుంది. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు వైపు ఎలాంటి సమాధానం వస్తుందో చూడాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో నాన్చుడు ధోరణి ఏ మాత్రం కరెక్ట్ కాదు. బాబు లక్ష్యాలు నెరవేరాలంటే ప్రత్యేక హోదా మాత్రమే మంచి ఆప్షన్ అవుతుంది.
కూటమి నేతలు ఎంత పోరాడితే అంత ప్రతిఫలం ఉంటుందని ప్రజల మద్దతు ఉంటే కూటమికి ఎప్పటికీ తిరుగుండదని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ప్రత్యేక హోదాకు కేంద్రం అంగీకరించని పక్షంలో పెద్ద మొత్తంలో కేంద్రం నిధులు మంజూరు చేస్తే మాత్రమే ఈ పరిస్థితి మారే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఏపీ ప్రయోజనాల విషయంలో కూటమి ఎంపీలు రాజీ పడకుండా ముందడుగులు వేయాల్సి ఉంది. టీడీపీ ప్రత్యేక హోదా విషయంలో గళం వినిపిస్తే టీడీపీ ప్రతిపాదనకు వైసీపీ సైతం మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందనే సంగతి తెలిసిందే.