- పవన్ తో జతకట్టి జాతీయస్థాయిలో కీలకం.
- కేంద్రం మెడలు వంచి నిధులు తేవడమే లక్ష్యం.
రాష్ట్రంలో నాలుగోసారి సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో అప్పటినుంచి ప్రజలంతా ఆయనపై ప్రత్యేకమైన నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు. అభివృద్ధి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే అభివృద్ధి అనే బ్రాండ్ ఆయనకు ఎప్పటి నుంచే ఉంది. ఆయనకు ఏ మాత్రం కేంద్రం సహకారం అందించిన అభివృద్ధిపై దృష్టి పెట్టి భవిష్యత్తు తరాలకు లైఫ్ అందించే విధానాలను రూపుదిద్దుతారు. అలాంటి చంద్రబాబు ఈసారి పవన్ తో జతకట్టడం వల్ల ఏపీలో కీలకం కావడమే కాకుండా, దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పే స్థాయికి చేరుకున్నాడు. బిజెపి ప్రభుత్వానికి గుండెకాయల మారడు అని చెప్పవచ్చు. అలాంటి ఈయన ఇదే అదునుగా భావించి ఏపీని అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తున్నారు.
బడ్జెట్ పై కొట్లాట:
ఈనెల 23వ తేదీన కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేయాలని కోరుతూ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర నాయకులను కలిశారు. అంతేకాకుండా విభజన చట్టంలోని సమస్యలను వేగంగా పరిష్కరించాలని అన్నారు. అంతేకాకుండా అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రత్యేక సాయాన్ని ప్రకటించాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయని, అలాగే రైలు మార్గాలు మంజూరు చేయాలని, విశాఖ రైల్వే జోన్ ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని , పారిశ్రామిక కారిడార్లు వేగవంతంగా ఏర్పాటు కావాలని అన్నారు.