అయితే ఒకవైపు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వలేక ఇంకోవైపు అటు కాంగ్రెస్ వైపు నిలబడలేక తటస్థ ధోరణితో వ్యవహరిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన నలుగురు ఎంపీల పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎన్నికల్లో భంగపడిన జగన్కు మళ్లీ పుంజుకునేందుకు ఈ పార్లమెంట్ సమావేశాలు ఒక మంచి అవకాశం గా మారబోతున్నాయి అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఎలాగో చంద్రబాబు అటు ఎన్డీఏ కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇక వాళ్లకి అనుకూలంగానే మోదీ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది.
అయితే గతంలో వైసిపి ఏకంగా ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి చేయలేకపోయింది.. ఇక పోలవరం లాంటి ప్రాజెక్టులకు నిధులను రాబట్టుకోలేకపోయింది. అందుకే ఇప్పుడు ఏకంగా వైసీపీ నుంచి గెలిచిన నలుగురు ఎంపీలు ప్రత్యేక హోదాపై పవర్ఫుల్ ప్రసంగాలు ఇచ్చి.. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి రాబట్టడానికి అటు టిడిపి ఎంపీలతో గొంతు కలిపితే.. మరోసారి తమది ప్రజల కోసం ఏర్పాటు అయిన పార్టీ అని జగన్ మరోసారి నిరూపించుకునేందుకు ఛాన్స్ ఉంది. ప్రజలు గెలిపించిన గెలిపించకున్న రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం అనే మెసేజ్ ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఛాన్స్ ఉంది. అందుకే తటస్థ ధోరణితో వ్యవహరించకుండా అటు టిడిపి జనసేన ఎంపీలతో కలిసి ప్రత్యేక హోదా కోసం గొంతు ఎత్తితే ప్రజలు మరోసారి వైసీపీని నమ్మే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ పార్లమెంట్ సమావేశాలు జగన్ పార్టీకి ప్రజల్లో మరోసారి నమ్మకాన్ని కూడగట్టుకోవడానికి మంచి అవకాశం గా మారిపోబోతున్నాయి అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరగబోతుందో చూడాలి.