ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత... రోజుకో దారుణం జరుగుతోంది. మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు జరగడం మనం చూస్తున్నాం. అయితే క్రైమ్ రేట్ తగ్గించడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పై రాష్ట్రపతి ద్రౌపది మురుముకు ఫిర్యాదు చేసింది వైసిపి పార్టీ. పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన హత్య కేసు నేపథ్యంలో.. వైసీపీ ఫిర్యాదు చేయడం జరిగింది.

పల్నాడు జిల్లా వినుకొండలో తమ పార్టీ కార్యకర్త.. దారుణ హత్యకు గురైన నేపథ్యంలో వైసిపి అధిష్టానం చాలా.. సీరియస్ గా తీసుకుంది. సోషల్ మీడియాలో దీన్ని ఖండించడం... రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం కూడా వైసిపి చేసేసింది. సోషల్ మీడియా వేదికగా ద్రౌపది మూర్ము కు ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. ఏపీకి ఇది వెరీ బ్యాడ్ మార్నింగ్ మేడం  అంటూ తమ ఫిర్యాదుల వైసీపీ స్పష్టం చేసింది.

వెంటనే... ఈ హత్య ఘటనపై జోక్యం చేసుకోవాలని... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కాపాడాలని రాష్ట్రపతి ద్రౌపది ని కోరింది వైసీపీ పార్టీ.  అంతేకాకుండా మాకు ప్రతి భారతీయుడి మద్దతు కావాలని... కోరుతున్నట్లు స్పష్టం చేసింది. ఎందుకంటే వైసీపీ నేతలు కూడా... ఇండియాలోనే భాగం... అంటూ రాష్ట్రపతిని ట్యాగ్ చేసి... ఫిర్యాదు చేసింది వైసిపి పార్టీ.

ఇది ఇలా ఉండగా పలనాడు జిల్లా వినుకొండలో దారుణమైన హత్య జరిగింది. అందరూ చూస్తుండగానే వైసిపి కార్యకర్తలు నరికి చంపారు. వినుకొండ వైసీపీ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు రషీద్ ను దారుణంగా పొడిచి చంపారు జిలాని. రషీద్ రెండు చేతులు నరికి మెడపై దాడి చేశారు.. అయితే జిలాని టిడిపి పార్టీకి చెందిన వాడని వైసిపి చెపుతోంది. కానీ పల్నాడు ఎస్పీ మాత్రం... ఈ కేసులో టిడిపి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: