ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఇప్పటికీ నెల రోజులు పైనే కావస్తున్న వాలంటరీ వ్యవస్థ పైన ఎలాంటి విషయాన్ని తెలియజేయలేదు.. వైసిపి పార్టీ హయాంలో వాలంటరీ వ్యవస్థ చాలా కీలకంగా మారింది. దీంతో రాష్ట్రంలో గత ఐదేళ్ల నుంచి ఉన్నటువంటి వాలంటరీలు కొంత మంది రాజీనామాలు చేసిన మరి కొంత మంది రాజీనామా చేయకుండా ఉన్న వాలంటరీల సైతం ఆందోళన చెందినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు వాలంటరీలకు పదివేల రూపాయలు చేస్తూ కొనసాగిస్తానని ఎన్నికల ముందు చెప్పినప్పటికీ ఆ విషయాన్ని కూటమి ప్రభుత్వం ఇంకా పట్టించుకోలేదు.



వాలంటరీల మీద కూటమి ప్రభుత్వం తర్జనభర్జన చేస్తూ కాలాన్ని నెట్టేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం మీద 2.67 లక్షలు వాలెంటరీలు వైసీపీ సర్కార్ నియమించింది. ఇందులో లక్ష మందికి పైగా రాజీనామాలు చేయడం జరిగింది.దీంట్లో మిగిలిన 1.50 లక్షల  మంది విషయంలో కూటమి సర్కార్ ఏ విధంగా నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.. ఇప్పటికీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు సైతం తమ బాధలను వాలంటరీలు వినిపించుకున్నారు. చాలా మంది గతంలో వాలంటీర్లను బలవంతంగా రాజీనామాలు చేశారని గత ప్రభుత్వం పైన చాలామంది విమర్శలు చేశారు.


కూటమితో వాలంటరీలను కొనసాగించేందుకు కొన్ని మార్గదర్శకాలు తీసుకోబోతున్నట్లు ప్రచారం అయితే జరుగుతున్నది. ముఖ్యంగా వీరి విద్యార్హతతో పాటు మూడేళ్ల కాళ్ల పరిమితి విధించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. వాలంటరీలు ప్రతి మూడేళ్లకు ఒకసారి కొత్తవారిని నియమించేలా చూడాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తాందట. అలాగే ఈ మూడేళ్లలో వృత్తిపరమైన శిక్షణ వాలంటరీలకు ఇచ్చి ఆ తర్వాత వారిని మంచి ఉద్యోగం లోకి పంపించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వీటి పైన త్వరలోనే అధికారికంగా కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా వెలుపడేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: