ఏ రాష్ట్రానికి అయినా దేశానికైనా నేటి ప్రాజెక్టులు అనేవి అత్యంత కీలకమైనవి. నీటి ప్రాజెక్టులు ఎక్కువగా ఉన్నట్లు అయితే నది నీరు వృధా పోకుండా రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక మన రాష్ట్రంలో అనేక నదులు ప్రవహిస్తున్నాయి. కాకపోతే ఆ నదులలో ప్రవహిస్తున్న నీటిని ఉపయోగించుకోవడంలో మాత్రం మన ప్రభుత్వాలు చాలా వరకు వెనకబడిపోయాయి. దానితో వర్ష కాలం వచ్చింది అంటే చాలు నదులలో పారే నీటిని ఒడిసి పట్టుకునే స్థాయిలో ప్రాజెక్టులు లేకపోవడం వల్ల మంచి స్వచ్ఛమైన నీరు అంతా రాష్ట్రాల మీదుగా పరిగెత్తి పరిగెత్తి చివరకు సముద్రంలో కలిసిపోయి ఎందుకు పనికి రాకుండా పోతుంది.

ఇక దానితో రాష్ట్ర ప్రభుత్వాలు , కేంద్ర ప్రభుత్వాలు అనేక నీటి ప్రాజెక్టులను నిర్మించి వాటి ద్వారా రైతులకు నీటిని అందించి దేశాలను , రాష్ట్రాలను సస్య సామలం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా కొన్ని ప్రాజెక్టులు పూర్తి కూడా అయ్యాయి. కొన్ని ప్రాజెక్టులు ప్రారంభం అయిన కూడా ప్రభుత్వాలు మారడం , నేతలు మారడం ఇలా అనేక కారణాల వల్ల కొన్ని మధ్యలోనే ఆగిపోతున్నాయి. అలా మొదలు అయ్యి పూర్తి స్థాయిలో పూర్తి కాని ప్రాజెక్టులలో తుమ్మిడి హట్టి ఒకటి. బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టును ప్రాణహిత నదిపై దీనిని నిర్మిస్తున్నారు. గతంలో తలపెట్టిన అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు రూపురేఖలను మార్చినపుడు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో పాటు ఈ ప్రాజెక్టు ఉనికి లోకి వచ్చింది.

కొమరంభీం జిల్లా , కౌటాల మండలం , తుంబడిహట్టి (తుమ్మిడిహట్టి) వద్ద ప్రాణహిత నదిపై 148 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మాణం ఈ ప్రాజెక్టులోని ప్రధానమైన భాగం. వార్ధా , పెన్‌గంగ నదులు సంగమించి ప్రాణహిత నదిగా రూపొందే స్థలం వద్ద ఈ బ్యారేజీని నిర్మిస్తారు. నిల్వ సామర్థ్యం 1.8 టీఎంలు. సిర్పూర్ , కాగజ్‌నగర్ , ఆసిఫాబాద్ , చెన్నూర్ , బెల్లంపల్లి నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. ఈ ప్రాజెక్టు కనుక విజయవంతంగా పూర్తి అయినట్లు అయితే సిర్పూర్ , కాగజ్‌నగర్ , ఆసిఫాబాద్ , చెన్నూర్ , బెల్లంపల్లి నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: