- కొత్త ప్రాజెక్టుకే బీటలు.
- మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంతో రైతులకు కష్టాలు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసి పనులను కూడా శరవేగంగా నడిపించారు. ఇలాంటి ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్క రైతుకు సాగు, తాగునీరు అందుతుందని భావించారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి తలమానికమవుతుందని ఎన్నో విషయాలని చెప్పారు. ప్రాజెక్టు కోసం లక్ష కోట్ల బడ్జెట్ ఖర్చు చేసి పనులను పూర్తి చేశారు. ఇంత ఖర్చు చేసి పనులు పూర్తిచేసిన ఇప్పటికి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ఒక్కసారి గట్టిగా వరద నీళ్లు వస్తే ఇక్కడో ఒక దగ్గర డ్యామేజ్ అవుతోంది. మరి ఈ విధంగా ఉంటే లక్ష కోట్లు వృధా అయినట్టా?మరి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల కలలానే మిగులుతుందా. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
కాలేశ్వరం ఖతం:
రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం రీ డిజైన్ చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వయసు తీరకుండానే కష్టాల పాలైంది. లక్ష కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు రూపకల్పన చేసినా, ఇలాంటి తప్పిదం జరగడం చూస్తే మాత్రం నిర్మాణంలో ఎంతో లోపం ఉందని అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్లాను ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రాణహిత నదిపై కాకుండా కాస్త కిందికి ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత ప్రధాన నిర్మాణాన్ని సాగేలా రీ డిజైన్ చేయించారు కేసీఆర్. ఓకే బ్యారేజీలా కాకుండా మూడు బ్యారేజీలు, 19 పంప్ హౌస్ లు, 100 కిలోమీటర్ల కాలువలతో నిర్మాణం చేపట్టారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో గోదావరి నుంచి దక్షిణాన హైదరాబాద్ చిట్యాల, షామీర్ పేట్ వాటర్ వచ్చేలా డిజైన్ చేసేసారు. మొత్తం ఈ ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాల్లో 18 లక్షల 25 వేల ఎకరాలకు నీరు అందుతుందని అన్నారు. దీని కింద శ్రీరామ్ సాగర్, నిజాంసాగర్, మిడ్, లోయర్, అప్పర్ మానేరు ప్రాజెక్టులను కూడా అనుసంధానం చేశారు. గోదావరి నీటిని మళ్లీ గోదావరిలోనే కలిసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం చేసింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో మూడు బ్యారేజీ నిర్వహించారు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ప్రధానంగా ఉంటాయి.