* ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాలకు సాగునీరు
* 13, 058 కోట్ల బడ్జెట్ తో సీతారామ ప్రాజెక్టు
* సీతారామ ప్రాజెక్టు డిజైన్ లో మార్పులు
తెలంగాణ రాష్ట్రం... దాదాపుగా బోర్లపైన ఆధారపడి ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మొట్టమొదటగా ఏర్పాటు అయిన తర్వాత... కొత్త ప్రాజెక్టులకు నాంది పలికింది. కాలేశ్వరం తో పాటు పాలమూరు ఎత్తిపోతల... పథకాలను కూడా దాదాపు కేసీఆర్ ప్రభుత్వమే పూర్తి చేసింది. అయితే.. కెసిఆర్ ప్రభుత్వంలోనే సీతారామ ప్రాజెక్టుకు కూడా... పనులు ప్రారంభం అయ్యాయి.
ఈ సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు సాగునీరు అందించవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 3.30 లక్షల కొత్త ఆయకట్టు.. అందుబాటులోకి వస్తుంది. అలాగే 3.50 లక్షల ఎకరాల వరకు ఆయకట్టు కూడా అస్థిరీకరణ అవుతుంది. అంటే దాదాపు 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు అందించవచ్చు అన్నమాట.
వాస్తవానికి కేసీఆర్ హయాంలోనే ఈ ప్రాజెక్టు... రూపొందించబడింది. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. 13, 058 కోట్ల బడ్జెట్ తో ఈ చేపట్టారు. 70 టీఎంసీల నీటి వినియోగమే లక్ష్యంగా..ఈ ప్రాజెక్టు... పంపు హౌస్ లో అలాగే ప్రధాన కాలువలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు కోసం సగం కు పైగా బడ్జెట్ ఖర్చు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ సీతారామ ప్రాజెక్టు పనులు కాస్త ఆలస్యంగా జరుగుతున్నాయి.
అంతేకాదు గత కేసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ ప్రకారం కాకుండా... వేరే ప్రణాళికలు చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాకర్ల, గుండె పూడి, పాలకొల్లు గ్రామస్తులు నిరసనలు తెలుపుతున్నారు. పాత డిజైన్ ప్రకారం ఈ ప్రాజెక్టు కెనాల్ పూర్తి చేసి... డిమాండ్ చేస్తున్నారు అక్కడి రైతులు. ఏదేమైనా.. మూడు జిల్లాల రైతులకు న్యాయం జరిగేలా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు కోరడం జరుగుతుంది. మూడు జిల్లాల రైతులకు కాంగ్రెస్ న్యాయం చేస్తే కచ్చితంగా.. వారందరికీ మేలు జరుగుతుంది.