ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాజెక్ట్ లను వేగంగా పూర్తి చేయడం ద్వారా బీడు భూములను సాగు భూములుగా మార్చడంతో పాటు లక్షల సంఖ్యలో ప్రజల దాహార్తిని తీర్చే అవకాశం ఉంటుంది. గోదావరి కృష్ణా అనుసంధానం ఏపీ ప్రజల చిరకాల కోరిక అనే సంగతి తెలిసిందే. సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాలను ఒడిసిపట్టి సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో గోదావరి కృష్ణా అనుసంధానం దిశగా గతంలో అడుగులు పడ్డాయి.
 
సాగునీటి వసతి ఉన్న ప్రాంతాలను స్థిరీకరించడంతో పాటు, తాగునీటి కొరతతో కష్టాల్లో ఉన్న ప్రాంతాలకు జలాలను తరలించి వారి కష్టాలను తీర్చాలనే ఆలోచనతో గోదావరి కృష్ణా అనుసంధానంకు సంబంధించిన డీపీఆర్ ను సైతం పూర్తి చేయడం జరిగింది. గోదావరి ద్వారా సముద్రంలో వృథాగా పోతున్న నీటిలో రోజుకు 2 టీఎంసీల తరలించడం ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలను తీర్చాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
 
అయితే ఇందుకు సంబంధించిన పనులు ఆశించిన స్థాయిలో పూర్తి కాలేదు. నిధుల లేమితో పాటు ఎన్నో సవాళ్లు ఉండటం ఈ ప్రాజెక్ట్ కు ఇబ్బందిగా మారిందని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే ఐదేళ్ల క్రితమే 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనాలు వేయగా ఇప్పుడు ఆ మొత్తం మరింత ఎక్కువ మొత్తంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
 
సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాల్లో ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు పడితే ఏపీ వాసులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. కేంద్రం సైతం నదుల అనుసంధానానికి సహాయసహకారాలు అందిస్తే మంచిది. గత కొంతకాలంగా నేతలు సైతం గోదావరి కృష్ణా అనుసంధానం గురించి పెద్దగా పెద్దగా ప్రస్తావించడం లేదు. దశాబ్దాల కల సాకారమవుతుందో లేదో చూడాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం బడ్జెట్ లో ప్రాజెక్ట్ లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: