అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, సురినామ్ అధ్యక్షుడు చంద్రికా పర్సాద్, మారిసన్ ప్రధాని ప్రవింత్ జుగ్నాథ్, గయానా అధ్యక్షుడు మహ్మద్ ఇర్ఫాన్ అలీ, పోర్చుగీస్ ప్రధాని ఆంటోనియో కోస్టా.. ఏంటీ ఇతర దేశాల అధ్యక్షులు, ప్రధానుల పేర్లు చెబుతున్నాను అని అనుకుంటున్నారా?  వీరంతా వీదేశీయులు కాదు.  కానీ ఆయా దేశాల్లో చక్రం తిప్పుతున్న భారతీయ మూలాలున్న భారతీయులు. త్వరలో జరగనున్న అమెరికా ఎన్నికల్లోను ఇండియన్ సంతతి లీడర్లు బరిలో ఉన్నారు.


అమెరికా ఎన్నికల్లో ఈ సారి కూడా భారతీయుల గురించే చర్చ. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరును ఖరారు చేయగా..  ఉపాధ్యక్ష అభ్యర్థిగా జీడీ వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. ఈ జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి మన తెలుగమ్మాయి కావడం విశేషం. జేడీ వాన్స్ పొలిటికల్ కెరీర్ ను తీర్చిదిద్దడంలో ఉషా చిలుకూరి కీలక పాత్ర పోషించారు.


ఈమె తల్లిదండ్రులది ఏపీ. కానీ ఆమె పుట్టింది మాత్రం కాలిఫోర్నియాలో. ఇక ఇటీవల ముగిసిన యూకే సార్వత్రిక ఎన్నికల్లోను భారతీయ సంతతి నేతలు సత్తా చాటారు. ఈ సారి రికార్డు స్థాయిలో 26 మంది భారతీయ సంతతి సభ్యులు బ్రిటన్ పార్లమెంట్ లో అడుగు పెట్టారు. ఇక ఈ ఎన్నికల్లో ఓడిపోయిన రుషి సునాక్ కూడా భారత సంతతికి చెందినవారే.


ఇప్పుడు భారతీయులు ఇలా గొప్పలు చెప్పుకొని వీరంతా మన వారే అని చెప్పుకొని వారిని ఓన్ చేసుకొని సంతోష పడాలేమో. ఎందుకంటే మన వాళ్లు ఎక్కువ జీతాలు, మంచి లైఫ్ జీవితంలో త్వరగా స్థిర పడొచ్చు అనే ఉద్దేశంతో చాలా మంది విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడుతున్నారు. దీంతో క్రమంగా మన సంస్కృతి తగ్గిపోతుంది. వారంతా విదేశీ విధానానికి అలవాటు పడ్డారు. మనం ఏమో వీరిని మన వాళ్లే అని ఓన్ చేసుకొని సంబుర పడుతున్నాం. ఇక భవిష్యత్తులో కూడా ఇలాంటి వార్తలే చూడాలి ఏమో.

మరింత సమాచారం తెలుసుకోండి: