వినుకొండలో చోటు చేసుకున్న రషీద్ హత్య ఘటన తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో నిందితుడి పేరు షేక్ జిలానీ కాగా రెండేళ్ల క్రితం వరకు స్నేహితులైన వీళ్లు ఒక చిన్న గొడవ వల్ల శత్రువులుగా మారారు. రెండేళ్ల క్రితం రషీద్ జిలానీ కుటుంబ సభ్యులను గాయపరచడంతో పాటు కేసు పెట్టి జైలుకు పంపించాడు. జిలానీ తన కుటుంబ సభ్యులపై దాడి చేశారని గతంలో పోలీసులకు సమాచారం ఇచ్చినా వాళ్లు పట్టించుకోలేదు.
 
అయితే జిలానీ రషీద్ పై బీరు సీసాలతో దాడి చేశాడనే కేసును మాత్రం పోలీసులు పట్టించుకోవడంతో జిలానీ జైలు శిక్ష అనుభవించాడు. తాను జైలు శిక్ష అనుభవించడానికి కారణమైన రషీద్ పై పగతో రగిలిపోయిన జిలానీ అత్యంత పాశవికంగా రషీద్ ను చంపాడు. జిలానీ రాజకీయ పార్టీకి సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తలలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
 
కొబ్బరి బోండాల కత్తితో రషీద్ పై జిలానీ దాడి చేశాడని సమాచారం అందుతోంది. ఎన్నికల సమయంలో ముస్లిం నాయకుల మధ్య ఘర్షణలు జరిగిన సమయంలో సైతం నమోదైన కేసుల్లో జిలానీ పేరును చేర్చారని తెలుస్తోంది. కళ్ల ముందు ఘోరం జరుగుతున్నా స్థానికులు సైతం రషీద్, జిలానీ మధ్య గొడవను ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.
 
జిలానీని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రషీద్ మృతదేహానికి పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాబోయే రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో ఏపీని షేక్ చేసిన ఘటనలలో ఈ ఘటన ఒకటి కాగా టీడీపీ వైసీపీ ఈ ఘటన విషయంలో ఒక పార్టీపై మరో పార్టీ ఆరోపణలు చేసుకుంటూ ఉండటం కొసమెరుపు. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: