వివేకా హత్య కేసు దర్యాప్తు, వైఎస్ సునీత పోరాటం, సుధాకర్ ను మానసిక క్షోభకు గురి చేసి చంపేయడం, జడ్జి రామకృష్ణపై జరిగిన అఘాయిత్యాల గురించి అనిత కామెంట్లు చేశారు. జగన్ ఏపీలో శాంతిభద్రతలు దిగజారిపోయాయంటూ పోస్టులు పెట్టడం హాస్యాస్పదం అని ఆమె పేర్కొన్నారు. ఐదేళ్ల వైసీపీ విషపు బీజాల అవశేషాల వల్ల రాష్ట్రంలో కొన్ని ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అనిత వెల్లడించారు.
వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టినా కార్యకర్తలు సంయమనం కోల్పోవద్దని అనిత పేర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ఆమె చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లలో జరిగిన దాష్టీకాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అనిత తెలిపారు. కూటమి పాలనపై బురదజల్లడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని ఆమె అన్నారు. జగన్ హయాంలో బాబు కంటే ఇబ్బంది పడ్డవారు ఎవరైనా ఉన్నారా అని అనిత వెల్లడించారు.
పవన్ ను ఏకంగా విశాఖ నుంచి నగర బహిష్కరణ చేశారని ఆమె పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో బాధితులుగా మారిన వారి ప్రతి ఒక్కరి బాధ మాకు తెలుసని ఆమె చెప్పుకొచ్చారు. మీరు చట్టాన్ని మీరొద్దని అనిత వెల్లడించారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరులో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారని ఆమె చెప్పుకొచ్చారు. వంగలపూడి అనిత చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్ల గురించి వైసీపీ నేతల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.