గత కొన్ని రోజులు ముందు వరకు కూడా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయిన అంశం ఒకటే అదే అపర కుభేరుడు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అయినా అనంత్ అంబానీ పెళ్లి వేడుక గురించి. ఏకంగా దేశంలోని సినీ రాజకీయ క్రీడారంగ ప్రముఖులందరూ కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఏకంగా వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మరి ఇక ఈ వివాహాన్ని జరిపించారు. దీంతో ఇక  ప్రీ వెడ్డింగ్ వేడుక దగ్గర నుంచి పెళ్లి జరిగేంతవరకు కూడా దేశవ్యాప్తంగా ఈ పెళ్లి గురించిన వార్తలు తెరమీదికి  వచ్చి అందరి దృష్టిని ఆకర్షించాయి అని చెప్పాలి.


 అయితే ఇలా అంబానీ ఇంటికి కొత్త కోడలు రాధిక మర్చంట్ వచ్చిందో లేదో ఇక ఆ కుటుంబానికి బాగా కలిసి వచ్చింది అనేది తెలుస్తుంది. కొత్త కోడలు అదృష్ట లక్ష్మిగా వచ్చి ఏకంగా అంబానీ కుటుంబానికి భారీగా లాభాలను తెచ్చి పెట్టింది అని చెప్పాలి. దీంతో ఈ వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కొత్తకోడలు రాకతో అంబానీ కుటుంబానికి 25 వేల కోట్ల లాభం వచ్చింది. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నార. మొన్నటి వరకు పెళ్లి సంబరాలలో ముఖేష్ అంబానీ ఎంతో బిజీ బిజీగా ఉన్నప్పటికీ.. వ్యాపారం మాత్రం ఎక్కడ తగ్గలేదు.


 పెళ్లి వేడుకలు జరిగిన కేవలం 10 రోజుల్లోనే 25 వేల కోట్ల రూపాయలను అంబానీ వ్యాపారం ద్వారా అర్జించారు అని చెప్పాలి. జులై ఐదున 118 బిలియన్ డాలర్లుగా ఉన్న ముఖేష్ అంబానీ సంపద.. జూలై 21 నాటికి 121 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో 12వ స్థానం నుంచి 11వ స్థానానికి చేరారు. అయితే ఇలా కొత్తకోడలు ముకేశ్ అంబానీ కుటుంబానికి ఎంతగానో కలిసి వచ్చిందని.. అందుకే ఆమె రాకతోనే భారీగా లాభాలను కూడా తెచ్చి పెట్టింది అంటూ ఎంతో మంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే ముఖేష్ అంబానీ పెళ్లికి బాలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా ఇక అన్ని ఇండస్ట్రీలలోని స్టార్స్ అందరూ కూడా హాజరై సందడి చేశారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: