పేర్ని నాని, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, డిటిసి లపై ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. పోలింగ్ రోజు అల్లర్లలో మేము ఇచ్చిన ఫిర్యాదు పై కేసులు నమోదు చేయలేదని.... న్యాయం జరిగే వరకు తాను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కదలనని చెప్పారు టీడీపీ సీనియర్ నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి. కొత్తగా వచ్చిన ఎస్పీ తమను ఇబ్బందులు పెట్టిన కేసులపై విచారణ జరపాలి... మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫ్యాషన్ చేస్తా అని గతంలో మాట్లాడాడని గుర్తు చేశారు.
మాకు ప్రాణాని ఉంది...కేతిరెడ్డిని తాడిపత్రి, అనంతపురం ,ఏపీ నుంచి బహిష్కరించాలని... కేతిరెడ్డి జీవితం గన్ మెన్ ల తోనే సాగిందన్నారు. పోలింగ్ రోజు కేతిరెడ్డి పెద్దారెడ్డి తమ కార్యకర్త సూర్యముని ఇంటిపై దాడి చేశారు... గతంలో ఐఏఎస్, ఐపీఎస్ లు ఏపీనీ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఆ అధికారులు ఇప్పుడు లా గురించి మాట్లాడతారా??? అని నిలదీశారు.
కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు ఇద్దరు కుమారులను బహిష్కరించాలి... మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే పంచె ఊడదీసి కొడతా... ఖచ్చితంగా కొడతామన్నారు. తాడిపత్రిలో నాకు శత్రువులు లేరు....వైసీపీ లో నలుగురు, ఐదుగురు ఉన్నారు... వాళ్ళపై చట్టపరంగానే వెళ్తానని వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రిలో ఉండడానికి నాకు పోలీసుల పర్మిషన్ అవసరం లేదు... నా నుంచి పోలీసులకు సమాచారం ఇస్తా... అప్పుడు రక్షణ కల్పించండన్నారు. తాడిపత్రిలో అల్లర్లు కేసులో నన్ను అరెస్ట్ చేసుకోండని తెలిపారు.