ఆమె గురించి చర్చించే వారు కూడా కనుమరుగైపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వర్గం మీడియానే కొన్నాళ్లుగా షర్మిల కావాలని హైలెట్ చేస్తూ తన అన్న గురించి ప్రస్తావించిన ప్రతి మాటలను కూడా హైలెట్ చేస్తూ వచ్చిందనే వార్త వాస్తవమే.. ముఖ్యంగా ఆమె ఏం మాట్లాడినా కూడా ఫస్ట్ పేజీలో బ్రేకింగ్ కవర్లు చేసినట్లు కవర్లు చేశాయి. కేవల జగన్ సర్కార్ను ఇబ్బంది పెట్టాలని కొన్ని చానల్స్ కంకణం కట్టుకున్నాయి. అందుకే షెర్మిలని పావుగా వాడుకున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. జగన్ ని ఓడించడంలో వివేకనంద రెడ్డి హత్య కేసుని ఎన్నోసార్లు షర్మిలకి అనుకూలంగా మార్చుకున్నారు.
కానీ ఇప్పుడు మాత్రం ఈ కేసు విషయం గురించి ఎవరు ఏమి మాట్లాడడం లేదు.దీన్నిబట్టి చూస్తే షర్మిల అధికారంలోకి వచ్చే అవకాశం లేదని కూడా మరొకసారి తేలిపోయింది జగన్ అధికారంలో నుంచి దింపేందుకే షర్మిల తన దూకుడిని ఇలా ఉపయోగించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. టిడిపి కూడా వీటిని తమకు అనుకూలంగా మార్చుకుందని చెప్పవచ్చు. ఇప్పుడు జగన్ పేరు పోయి చంద్రబాబు మీద షర్మిల చేస్తున్న వాక్యాలు రాజకీయంగా ప్రాధాన్యం పెద్దగా ఉండేలా కనిపించడం లేదట. ఇటీవల చంద్రబాబు పైన హామీలు ఇచ్చిన వాటిపైన ఢిల్లీ పర్యటన పైన కూడా ఎన్నోసార్లు షర్మిల ప్రశ్నించింది. గతంలో షర్మిల గురించి మొదటి పేజీలలో వేసిన వార్తాపత్రికలు కూడా ఇప్పుడు ఆమెను పట్టించుకోవడం లేదట. దీన్ని బట్టి చూస్తే షర్మిల ఇకనైనా మారుతుందో లేదో చూడాలి మరి.