కాంగ్రెస్‌ పార్టీ తరఫున మొన్న ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న పెద్ద వివాదం లో చిక్కుకున్నారు. ఎమ్మెల్సీగా గెలిచి నెల రోజులు కూడా సరిగా కాలేదు.. ఓ యాక్సిడెంట్‌ కేసులో బుక్‌ అయ్యారు. తీన్మార్ మల్లన్న కార్ "TS 30 J 7200" మహీంద్రా తార్ గురువారం సాయంత్రం రోజున ఓ వలస కార్మికుడి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ కార్ తీన్మార్ మల్లన్న ప్రధాన అనుచరుడు అయినటువంటి కాసుల ఆంజనేయులు గౌడ్ కుటుంబసభ్యులైన కాసుల తులసి పేరుతో రిజిస్టర్ అయి ఉంది.


ఘట్కేసర్ జీడిమెట్ల వద్ద రాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు పక్కన వెళ్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉదేశ్ (32) అనే వ్యక్తిని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో గాయాలు అయిన ఉదేశ్ ను అక్కడ సమీపంలోని నీలిమ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఉదేశ్ మృతి చెందారు. ఆ కారులో తీన్మార్ మల్లన్న మరియు అతని అనుచరులు ప్రయాణిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఇక ఈ కేసు నుంచి తప్పించుకోవాలని తీన్మార్ మల్లన్న డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క కార్యాలయం నుంచి పోలీసులకు ఫోన్లు చేపించి ఒత్తిడి తెస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన సిసి ఫుటేజ్ లను కూడా పోలీసులు ఇంతవరకు బహిర్గతం చేయడం లేదు. ఈ యాక్సిడెంట్ తీన్మార్ మల్లన్న చేయడంతోనే పోలీసులు ఇంత గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది.


తీన్మార్ మల్లన్నకు బినామీగా ప్రచారంలో ఉన్న ఆంజనేయులు గౌడ్ సెటిల్మెంట్ కోసం పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ కు వచ్చి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బాధిత కుటుంబసభ్యులపై బెదిరింపులకు పాల్పడ్డాడు. మీరు ఏమి పీక్కుంటారో పీక్కోండి.... ప్రభుత్వమే మాది అంటూ వారిపై దుర్భాషలు ఆడారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: