ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరాచక పాలన జరుగుతోంది అంటూ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వినుకొండలో విరుచుకు పడడం జరిగింది.. నిన్నటి రోజున వైసిపి కార్యకర్తను వినుకొండలో నడి  రోడ్డులో హత్య చేయడంతో ఒక్కసారిగా రాజకీయ కక్షలు బగ్గుమంటున్నాయి. ముఖ్యంగా వైసిపి కార్యకర్త రషీద్ మరణించడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అనంతరం జాతీయ మీడియాతో మాట్లాడడం జరిగింది. కేవలం వైసీపీ కార్యకర్త అనే రషిదును ఇలా దారుణంగా హత్య చేశారు అంటూ తెలిపారు.


ఈ విషయాలను టిడిపి మంత్రులు నేతలు సైతం వ్యక్తిగత కారణాలు అంటూ క్రియేట్ చేశారని కేవలం వైసీపీ కోసం పని చేశాడని ఉద్దేశంతోనే రషిదును ఇలా హత్య చేశారు అంటూ తెలిపారు.. అయితే మా ఎంపీ ఎమ్మెల్యేలపై కూడా దాడి జరిగింది దాడి చేసింది కూడా  వాళ్లే అయినా..మర్డర్ కేసులకు వంటివి పెట్టారని జగన్ తెలిపారు. ఏపీలో జరుగుతున్న ఇలాంటి దాడుల పైన అరాచక పాలన పైన ప్రధాన మోడీతో సహా అందరిని కలుస్తానని రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి దాడులను వివరిస్తామని తెలిపారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి.


అంతేకాకుండా రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తామని ఇలాంటి అరాచకాలకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు.వచ్చే బుధవారం ఢిల్లీలో జగన్ నేతృత్వంలో ఈ ధర్నా చేయబోతున్నట్లుగా తెలియజేశారు. ఇందులో వైఎస్ఆర్సిపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొనబోతున్నారని జగన్ ప్రకటించడం జరిగింది.. దీన్నిబట్టి చూస్తే రాబోయే రోజుల్లో మరింతగా వైసీపీ పార్టీని ముందుకు నడిపించే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ విషయం పైన అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: