2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా సౌకర్యాలను అనుభవించారని అంటారు. ప్యాలెస్ లో ఉండి ఎవరినీ కలవకుండా బతికారు అనే విమర్శలు కూడా బాగానే వినిపిస్తున్నాయి. ఇక కమర్షియల్ ఏరోప్లేన్స్‌ను ఉపయోగించడం పూర్తిగా మానేశారు గత ఐదేళ్లలో వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రతిసారి ప్రత్యేక విమానాల్లో ప్రయాణించారు. గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా అతను వాణిజ్య విమానం ఎక్కిన సందర్భాలు లేవు.

అయితే, ఇటీవలి ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత 5 ఇయర్స్‌లో తొలిసారిగా సాధారణ కమర్షియల్ ఫ్లైట్ ఎక్కారు. నిన్న ఉదయం బెంగళూరు నుంచి ఇండిగో విమానంలో గన్నవరం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గత ఐదేళ్లలో జగన్ సామాన్య ప్రజలతో కమర్షియల్ విమానం ఎక్కడం ఇదే తొలిసారి.

గత ఐదేళ్లుగా జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసేటప్పుడు తన ఖర్చులను ప్రభుత్వం పైనే వేశారు. రాష్ట్రమే భరిస్తుందని అన్ని భోగాలను ఆయన అనుభవించారని విమర్శలు వచ్చాయి. నిజానికి ఆయన ప్రజలకు కూడా ప్రభుత్వం లక్షల కోట్లను అందించారు. ఒక్క అభివృద్ధి విషయంలోనే వెనుకబడ్డారు. అయితే ఇప్పుడు ఆయన కేవలం ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా కూడా లేకపోవడంతో ఈ ప్రత్యేకాధికారాలను కోల్పోయారు.

ఇక నుంచి అప్పుడప్పుడు జగన్ సామాన్యులతో కలిసి విమానాల్లో ప్రయాణించడం మనం చూస్తూనే ఉంటామని పలువురు మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేక విమానాలకు సాధారణంగా లక్షల రూపాయలు ఖర్చవుతుంది కాబట్టి జగన్ వీటిలో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు వైఎస్ జగన్ పల్నాడు జిల్లాలో దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్నివేళలా అధికారంలో ఉండరని గుర్తుపెట్టుకోండి అంటూ టీడీపీ నేతలకు గట్టిగానే ప్రారంభించారు. ఏపీలో శాంతిభద్రతలను కాపాడాలని కేంద్ర పెద్దలకు విజ్ఞప్తి కూడా చేశారు. అయితే ఈ ఇటీవల కాలంలో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఆంధ్రాలో ఆందోళనలు ఎక్కువయ్యాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: